Hero nitin supports pawan kalyan jana sena party

Nitin, pawan kalyan, Nitin Supports pawan kalyan jana sena party, Hero Nitin Supports pawan kalyan jana sena party, pawan kalyan jana sena party, JANA SENA.

Hero Nitin Supports pawan kalyan jana sena party

హీరో నితిన్ పవన్ రుణం తీర్చుకున్నాడు?

Posted: 03/19/2014 04:20 PM IST
Hero nitin supports pawan kalyan jana sena party

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.  చిన్నపిల్లాడి దగ్గర  నుండి..  చివరి వయసులో  ఉన్న ముసలాడి వరకు అందరు ఇష్టపడతారు.  పవన్ అంటే  అభిమానం, పిచ్చి, ప్రేమ,  భక్తి  అన్నీ ఒకేసారి చూపిస్తారు ఆయన పవన్ ఫ్యాన్స్. మరో గొప్ప విషయం ఏమిటంటే..  టాలీవుడ్ లోని  హీరోలే పవన్ వీరాభిమానులుగా  ఉన్నారు.  

అలాంటి వారిలో  హీరో నితిన్ ఒకరు.  టాలీవుడ్ లో  నితీన్  కెరీర్  ముగినిపోతున్న  సమయంలో.. పవన్  పవర్  అందించటంతో.. నితిన్   కొలుకున్నాడు. అప్పటి నుండి  నితీన్  నటించే  ప్రతి సినిమా  తప్పనిసరిగా.. పవన్  డైలాగ్,  పవన్ పాట,  పవన్  స్టైల్,  పవన్ యాక్షన్  ఏదో ఒకటి  పెట్టుకోని  పవన్ పవర్ ను    హీరో నితిన్  అనుభవిస్తున్నాడు.  

అయితే ఇప్పుడు  పవన్  స్థాపించిన  జనసేన పార్టీకి  తనవంతు  సాయంగా  30 కోట్లు ఇచ్చినట్లు  టాలీవుడ్ వార్తలు వస్తున్నాయి. అయితే జన సేన పార్టీ కోసం హీరో నితిన్ ఇచ్చిన 30 కోట్లను  పవన్ కళ్యాణ్  సున్నితంగా  తిరస్కరించాడట.  నితిన్ బాధపడటం చూసిన పవన్  తెలంగాణలో  జన సేన పార్టీ కార్యక్రమాలు నీ చేతులు మీదగా జరుగుతాయని  చెప్పటం  నితిన్ ఆనందంతో  పొంగిపోయినట్లు తెలుస్తోంది. 

అంటే   తెలంగాణలో  జన సేన పార్టీకి  ఇన్ చార్జ్ గా ఉన్నట్లు తెలుస్తుంది.  ఈ విషయాన్ని  నితిన్ తండ్రితో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తోంది.  పవన్ సపోర్టు చేసిన పర్వలేదు గానీ,  తెలంగాణ ప్రాంత నాయకుల మీద, రాజకీయ నాయకుల మీద కామెంట్స్ చేయవద్దని  నితిన్ కు తండ్రి చెప్పినట్లు సమాచారం.  అయితే మొత్తం మీద  పవన్ జన సేన పార్టీకి   తెలంగాణలో హీరో నితిన్ రెడ్డిగారి బాధ్యతలు తీసుకోవటం  పవన్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles