Nagababu daughter niharika acting in tv

nagababu, nagababu daughter niharika, nagababu daughter niharika acting in tv, manchu lakshmi prasanna kumari, Konidela Niharika.

nagababu daughter niharika acting in tv

వెండితెర వద్దు,,, బుల్లితెరే కావాలి : నాగబాబు కూతురు

Posted: 03/18/2014 03:13 PM IST
Nagababu daughter niharika acting in tv

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు అందరు హీరోలుగానే  వెండితెరకు పరిచయం అవుతున్నారు.  అయితే  గత కొంత కాలంగా మెగా అన్నయ్య తమ్ముడు  నాగబాబు కూతురు నీహారిక  వెండితెరకు పరియం అవుతుందనే  వార్తలు వినిపించాయి. ఆ సమయంలో  అక్కినేని అఖిల్ సరసన నటించబోతోందని వార్తలొచ్చాయి.అఖిల్, నీహారిక ఇద్దరు కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత మాత్రం నీహారిక తెరంగేట్రం గురించి ఎటువంటి వార్తలు బయటికి రాలేదు. దీనికి అసలు కారణం చిరంజీవి, నీహారికని సినిమాలో నటించవద్దని చెప్పడంతో తన ప్రయత్నాలు మానుకొందని తెలిసింది. నీహారిక దీనితో వెండితెరకు బదులుగా బుల్లితెరపై వెలగడానికి రంగం సిద్దం చేసుకుంది. 'ఈటీవీ'లో ఢీ జూనియర్ పేరుతో ఓ రియాలిటీ షోకి వ్వాఖ్యాతగా వ్వవహరించబోతున్నట్టు సమాచారం. 

ఇప్పుటికే ఆమె తండ్రి నాగబాబు పలు టీవీ షోలకి జడ్జిగా వ్వవహరిస్తున్నారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకొని నీహారిక బుల్లితెరకి పరిచయం అవుతుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి సినిమాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బుల్లితెర మీద ఇప్పటికే  మంచు వారి అమ్మాయి  లక్ష్మీ ప్రసన్న దూసుకుపోతున్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు  మెగా వారి అమ్మాయి నీహారిక  బుల్లితెరపై  ఎలా రాణిస్తుందో చూడాలి.

-ఆర్ఎస్

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles