Pawan kalyan three lives and one lie

Pawan Kalyan three lives and one lie, Pawan Kalyan party, Pawan kalyan Sanasena party, Pawan Kalyan personal life, Pawan Kalyan political entry

Pawan Kalyan three lives and one lie

పవన్ కళ్యాణ్ మూడు జీవితాలు ఒక అబద్ధం

Posted: 03/15/2014 11:47 AM IST
Pawan kalyan three lives and one lie

వ్యక్తిగత సంబంధాల గురించి సుతిమెత్తగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక కుటుంబంలో నాలుగు గోడల మధ్య జరిగిన విషయాలు బయటివారికి తెలియవు అని అన్నారు. 

మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నానని, అందువలన రాజకీయాలకు తగడని చెప్తున్న నాయకులకు ఆయన సున్నితంగా చెప్తూనే గట్టి హెచ్చరికలు చేసారు. 

పవన్ తన గురించి మంచి అభిప్రాయం కలిగేలా చెప్పాలంటే తన భార్యల గురించి తప్పు గా చెప్పవలసి వస్తుంది.  అది ఆయన కు నచ్చే విషయం కాదు.  పైగా ఎవరైనా తన వ్యక్తిగత విషయాలను బయటివారికి ఎందుకు చెప్పుకోవాలి.  అందులోనూ విడిపోయిన భార్యలు తమ జీవితంలో స్వేచ్ఛగా జీవించటానికి వీలు కల్పించాలి కదా.  అందువలన పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పనని చెప్పారు.

అలా చెప్తూనే పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాల మీద వ్యాఖ్యానాలు చేస్తున్నవారిని ఇంతవరకు ఉపేక్షించినా అటువంటివాళ్ళ వ్యక్తిగత విషయాలను బయటకు లాగి ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్క్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తానని అన్నారు.  అందుకు తన దగ్గర సిఐడిలు ఎవరూ లేరు కానీ అభిమానుల అండ మాత్రం దండిగా ఉందని అన్నారు.  ఆలా ఖబర్దార్ నా జోలికి వస్తే అనే సంకేతాలిచ్చారాయన.

వి హనుమంతరావు వ్యాఖ్యల మీద స్పందిస్తూ, తాను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా కాబట్టి తగనని, రాహుల్ గాంధీ ఒక పెళ్ళి కూడా చేసుకోలేదని అన్నారు కానీ రాహుల్ బ్రహ్మచారని అనలేదు కాబట్టి అది మాత్రం నిజమేనని అన్నారు పవన్ కళ్యాణ్.  రాజకీయలాకు ఒక పెళ్ళి చేసుకుని 30 మందితో సంబంధం పెట్టుకునేవాళ్ళకు అర్హతుంటుందిలే అంటూ ఎత్తిపొడిచారు.  విహెచ్ కి లూనావాలా రిసార్ట్స్ ని గుర్తుచేసారు కూడా.

తన వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం, రాజకీయ జీవితాలను విడిగా చేస్తూ వాటికి తగిన ప్రాధాన్యతలనిస్తూ ముందుకు సాగదలచకున్న పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఒక అబద్ధం ఆడారు.  అదేమిటంటే తాను అక్కడికి వస్తున్నట్లుగా తన కుటుంబంలో ఎవరికీ చెప్పలేదని.  ప్రపంచమంతా తెలిసిన కార్యక్రమం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, ఆయన ఇంట్లో టివి లు లేవా వాళ్ళు చూడరా అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి. 

కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం మనకు తెలియదు కాబట్టి ప్రసంగంలో అన్నీ ఆయన హృదయ తరంగాలే అయినప్పుడు ఇదీ నిజమే అయ్యుంటుంది.  తన పిల్లలకు ఆయన చెప్పివుండకపోవచ్చు.  తను పడ్డ మధనంలో అన్నయ్యతో విభేదమవుతుందా అని ఆలోచించినట్లుగానే, అన్నిటికీ సిద్ధపడి రాజకీయాలలోకి వచ్చిన తన మీద ఆధారపడ్డ తన ముగ్గురు పిల్లలకు ఏమవుతుందా అని వాళ్ళని చూస్తూ బాధపడ్డ విషయాన్ని ఆయన తన ప్రసంగంలో చెప్పారు.  కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలనూ చెప్పి ఉండకపోవచ్చు కదా!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles