దక్షిణాదిలో రాజ్యమేలిన సుందరాంగులు హిందీ పరదా మీద మెరిసే దిశగా చాలా కాలంగా కృషి చేస్తున్నారు. అందులో కొందరు ఆ ప్రయత్నంలో విజయం సాధించారు కూడా. ఆ హీరోయిన్లు వీరే-
1.ఇలియానా డిసౌజా
గోవా సుందరి ఇలియానా చేతిలో ఉన్న హిందీ సినిమాలు ఇవి- డేవిడ్ ధవన్ నిర్మిస్తున్న మేఁ తెరా హీరో. అందులో ఆమె వరుణ్ ధవన్ తో నటిస్తోంది. రెండవది సైఫ్ అలి ఖాన్ తో హ్యాపీ ఎండిగ్ చిత్రం.
తెలుగు తమిళంలో ఒక వెలుగు వెలిగిన ఇలియానా ఉన్నట్టుండి దక్షిణాది చిత్రాలలో అవకాశాలు రాకపోవటంతో ఆమె దృష్టి హిందీ సినీ పరిశ్రమవైపు మళ్ళింది. ముందుగా రణవీర్ కపూర్ తో బర్ఫీ సినిమాలో హిందీ పరదా మీద ప్రవేశించి తన నటనా కౌశలాన్ని చూపించింది కానీ దక్షిణాదిలోలాగా పిచ్చెక్కించే అందాల ఆరబోతకు అవకాశం లేకపోయింది. ఫటా పోస్టర్ నికలా హీరో చిత్రం ఆమెకు నిరాశ మిగిల్చింది. కానీ ఇప్పుడు ఉన్న రెండు హిందీ సినిమాలు ఆమెను హిందీ పరిశ్రమలో నిలబెడతాయని ఆశిస్తోంది.
2. తమన్నా భాటియా
శ్వేత సుందరిగా పేరుగాంచిన ఢిల్లీ మెరుపుతీగ తమన్నా భాటియా పూర్తిగా దక్షిణాదిని వదిలిపెట్టటం లేదు. తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తూనే హిందీలో సాజిత్ ఖాన్ చిత్రం హమ్ షకల్ లో సైఫ్ అలి ఖాన్ బిపాసా లతో కలిసి పని చేస్తోంది. అలాగే అక్షయ్ కుమార్ తో కలిసి ఇట్స్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకుంది.
తెలుగులో హ్యాపీ డేస్ తో చిత్ర పరిశ్రమకు పరిచయమైన తమన్నా ఆ తర్వాత 100 పర్సంట్ లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, కేమెరా మన్ గంగ లాంటి సినిమాలలో వైవిధ్యమున్న పాత్రలలో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించింది.
3. మీరా ఛోప్రా
ప్రియాంకా చోప్రా కజిన్ ఢిల్లీ సుందరి మీరా ఛోప్రా కూడా ముందుగా దక్షిణాదిలో రాణించి తర్వాత హిందీ పరదాకు వద్దామనే అనుకుంది. 2007 లో బంగారం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన మీరా తర్వాత వాన, మారో, గ్రీకు వీరుడు సినిమాలలో అందాలను ఆరబోసినా ఎక్కువగా గుర్తింపు రాలేదు.
తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలతో పాటు ఆమెకు హిందీలోనూ విక్రమ్ భట్ చిత్రం 1920 లండన్, గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్ సినిమాలలో నటించే అవకాశం లభించింది. వీటిలో 1920 లండన్ చిత్రీకరణ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్ చిత్రీకరణ ఇంకా జరుగుతోంది.
4. శ్రుతి హాసన్
కమలహాసన్ కూతురు శ్రుతి హాసన్ దక్షిణాదిన తెలుగు తమిళ సినిమాలలో బాగానే రాణించింది.
అయితే హిందీలో లక్ సినిమాలో ఆమె మొదటి అడుగు ఆమెకు కాస్త ప్రతికూలమైన ఫలితమే ఇచ్చింది. ఆ తర్వాత దిల్ తో బచ్చా హై జీ శ్రుతికి పెద్దగా గుర్తింపునివ్వలేదు. రామయ్య వస్తావయ్య, డి డే సినిమాల నుండి గుర్తింపు లభించి శ్రుతి హాసన్ ఇప్పుడు వెల్ కం బాక్ లో నానాపాటేకర్, అనిల్ కపూర్ జాన్ అబ్రహంలతోను, గబ్బర్ చిత్రంలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్ లతోనూ కలిసి నటిస్తోంది.
5. కృతి సనన్
మహేష్ బాబు తో హిరోయిన్ గా 1, నేనొక్కడినే సినిమాలో గ్లామర్ ని గుప్పంచిన మోడల్ కృతి సనన్, తెలుగు ప్రేక్షకులను అలరించినా ఆమెకు తెలుగులో మళ్ళీ పిలిచిన నాథుడు లేకపోయాడు. హిందీ సినిమాతో ప్రారంభిద్దామా అనుకుంటూనే తెలుగుతో తన కెరీర్ ని ప్రారంభించిన కృతికి హిందీలో అవకాశం వచ్చింది.
సాజిద్ నాదియావాలా నిర్మిస్తున్న హీరోపంతి చిత్రంలో జాకీ ష్రాప్ కుమారుడు టైగర్ ని పరిచయం చేస్తున్నారు. అందులో కృతి సనన్ కి నటించే అవకాశం లభించింది. అంటే ఈ సంవత్సరం కృతి ని హిందీ పరదా మీద చూడగలం.
6. తాప్సీ పన్ను
దక్షిణాదిలో తనకంటూ ఒక చిన్న ఇమేజ్ ని సంపాదించుకున్న ఢిల్లీ తార తాప్సీ పన్ను 2010 లో ఝుమ్మంది నాదంతో మొదలుపెట్టి, వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ ఫెక్ట్, వీరా, మొగుడు, సాహసం సినిమాలలో నటించింది. ఇంకా తమిళంలో మలయాళంలో కూడా నటించిన తాప్సీ హిందీలో ఛష్మే బద్దూర్ లో కూడా రాణించింది.
ప్రస్తుతం రన్నింగ్ షాదీ డాట్ కామ్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అయితే తాప్సీ పూర్తిగా హిందీ సినిమా పరదాకే అంకితమవాలని అనుకోవటం లేదు. అందువలన ఆమె హైద్రాబాద్, చెన్నై, ముంబై మధ్య ప్రయాణాలు చేస్తూనే వుంది.
7. ఆసిన్
తెలుగులోను, తెలుగు డబ్బింగ్ సినిమాలలోను నటించి మెప్పించిన ఆసిన్ తొట్టుమ్కల్ మలయాళ సుందరి. మలయాళ సినిమాతో కెరీర్ ని మొదలుపెట్టిన ఆసిన్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం సినిమాలలో తెలుగులో వరుసగా నటించి, తమిళ సినిమాల తెలుగు డబ్బింగ్ ఘజని, దశావతారం సినిమాల్లోకూడా మెప్పించిన ఆసిన్ హిందీ సినిమా వైపు అడుగులు వేసింది.
ఘజని సినిమా లో ఆమె నటన చూసి మెచ్చుకున్న ఆమిర్ ఖాన్ అదే సినిమా రీ మేక్ లో అదే హీరోయిన్ కి అవకాశమిచ్చారు. ఆ తర్వాత లండన్ డ్రీమ్స్ లో నటించిన ఆసిన్ కి ఆతర్వాత కొన్నాళ్ళు ఇరు ప్రాంతాలలోనూ అవకాశాలు కరువయ్యాయి. ఆ తర్వాత రెడీ, హౌస్ ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786 లో అవకాశాలు లభించాయి. ప్రస్తుతం ఆల్ ఈజ్ వెల్ ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్. మరో అనీస్ బజ్మీ చిత్రం నో ఎంట్రీ మే ఎంట్రీ కూడా ఆమె ఒడిలో పడబోతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more