Samantha was told i love you

samantha, taj mahal, anil krishnaveni, Samantha, Samanthas Prathyusha Foundation story, child, Siddhardh

samantha, taj mahal, anil krishnaveni, Samantha, Samanthas Prathyusha Foundation story, child, Siddhardh

కోరిక తీర్చి ఆత్మసంతృప్తి పొందుతుంది

Posted: 03/11/2014 08:01 PM IST
Samantha was told i love you

బబ్లీ బ్యూటీ సమంతాకి అందరి హీరోయిన్ల కంటే కాస్తంత ఉదార స్వభావం ఎక్కువే అని చెప్పాలి. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి ఆదుకోవడం, లేక వారికి ఏమైనా తీరని కోరికలు ఉంటే తీర్చడం చేస్తూ ఉంటుంది తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా. గతంలో దిల్ సుఖ్ నగర్ పేళుళ్ళ బాధితుల్ని ఆదుకున్న సమంతా ఇప్పుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న మరో ఇద్దరి చిన్నారుల చిరకాల కోరికను తీర్చి వారి కృతజ్ఞతలు అందుకుంది.

హైదరాబాద్ కి చెందిన ఇద్దరు చిన్నారులు అనిల్ , కృష్ణవేణి లకు ప్రపంచ వింతల్లో ఒక్కటైన తాజ్ మహల్ ని చూడాలని వారి చిరకాల చివరి కోరిక. అనుకున్నదే తడవుగా వారిద్దర్ని హైదరాబాద్ నుండి ఆగ్రాకు విమానంలో పంపించి వారి కోరికను తీర్చింది. చిరకాల కోరిక తీరడంతో వారి కళ్ళలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వారిద్దరు సమంతాకు థ్యాంక్యూ సమంతా అక్కా ... వీ లవ్ యూ ... అంటూ సంబరపడిపోతుంటే సమంతా కళ్లలో ఆనంద భాష్పాలతో పాటు ఆత్మసంతృప్తిని పొందుతుంది. మనిషికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత అందం ఉన్నా అవన్నీ ఆత్మ సంతృప్తి ముందు దిగదుడుపే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles