Rajinikanth film dubbing rights for record price

Kochadaiyaan Telugu dubbing rights, Dubbing rights for Rajinikanth film, 28 crores Telugu dubbing rights, Rajinikanth Kochadaiyaan movie,

Kochadaiyaan Telugu dubbing rights, Dubbing rights for Rajinikanth film, 28 crores Telugu dubbing rights, Rajinikanth Kochadaiyaan movie,

‘విక్రమ సింహా ’కు అంత రేటా ?

Posted: 03/11/2014 05:22 PM IST
Rajinikanth film dubbing rights for record price

సౌత్ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో భారీ బడ్జెట్, గ్రాఫిక్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళ భాషలో్నే కాకుండా వివిధ భాషల్లో కూడా విడుదల అవుతున్న ఈ సినిమా తెలుగులో ‘విక్రమ్ సింహా ’ పేరుతో వస్తోంది. ఇటీవలే ఆడియోను విడుదల చేసుకున్న ఈ సినిమా తెలుగు రైట్స్ భారీ ధరకు అమ్మడు పోయినట్లు సమాచారం.

రజినీకాంత్ కి తమిళంతో సమానంగా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటం, గతంలో ఆయన నటించిన ‘రోబో ’ చిత్రం తెలుగులో మంచి వసూళ్ళు సాధించడంతో ఈ సినిమాను దాదాపు 28 కోట్లు చెల్లించి దక్కించుకున్నారని అంటున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్ హక్కులను దాదాపు రెండేళ్ళ క్రితమే 5 కోట్లు ఇచ్చి బుక్ చేసుకున్నారట. అయితే డబ్బింగ్ సినిమాకు ఇంత భారీ మొత్తం చెల్లించి తీసుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే మొదటి సారి.

అయితే ఈ తెలుగు వెర్షన్ కు గాను ఎంత ఖర్చు పెట్టారు...ఏ రేంజిలో బిజినెస్ అవుతుందనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన దీపికా పదుకొనె నటించగా, ఆది పినిశెట్టి ఓ కీలక పాత్ర పోషించాడు.  తెలుగు వెర్షన్ ని లక్ష్మి గణపతి ఫిలింస్‌ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. తమిళ్‌, హిందీ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

శోభన, శరత్‌కుమార్‌, జాకీ ష్రాప్‌, నాజర్‌ ..ఇలా భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇంత భారీ మొత్తం వసూలు చేయాలంటే రోబో సినిమా కంటే పెద్ద హిట్ అవ్వాలని విశ్లేషకులు అంటున్నారు. మరో అవతార్ సినిమాతో పోల్చుతున్న ఈసినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles