Balakrishna neck tattoo is tension jagapathi babu

balakrishna, jagapathi babu, balakrishna neck tattoo, Legend Balakrishna, Legend , Legend movie release, Legend movie audio release, Legend movie release date, Legend movie jagapathi babu.

balakrishna neck tattoo is tension jagapathi babu?

బాలయ్య మెడపై టాటూ - జగపతి బాబులో టెన్షన్ ?

Posted: 03/08/2014 02:58 PM IST
Balakrishna neck tattoo is tension jagapathi babu

సీనియర్ నటుడు బాలయ్య,  మరో సినీయర్ నటుడు జగపతి బాబు.. ఒకే వేదిక పై  కనిపించి  నందమూరి, జగపతి అభిమానులకు  నూతన ఆనందాన్ని ఇచ్చారు.  ఈ అద్బుతమైన  సన్నివేశం  శిల్పారామం  వేదిక అయ్యింది . లెజెండ్  సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక పై  బాలయ్య, జగపతిబాబు  సందడి చేశారు.  

అయితే  'లెజండ్' సినిమాలో బాలయ్య గెటప్స్ అన్నీ అదిరిపోయే స్థాయిలో వున్నాయి. ఒక కొత్త బాలయ్యను ప్రేక్షకులు చూడనున్నారనడానికి ఇవి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇందులో బాలయ్య మరో కొత్తరకంగా కనిపిస్తున్నారు. బాలయ్య మెడపై ఎడమ భాగంలో వున్న టాటూ (పచ్చబొట్టు) ఒకటి అందర్నీ ఆకట్టుకుంటోంది.  

ఈ  సినిమాలో విలన్ గా నటించిన జగపతిబాబు చాలా ఇబ్బందిపడినట్లు  తెలుస్తోంది.  జగపతిబాబుకు ఆ సినిమా షూటింగు సమయంలో పెద్ద సమస్య వచ్చిందని . ఆడియో ఫంక్షన్ వేధిక  పై చెప్పటం జరిగింది.అదేమిటంటే, బాలయ్యను ఎలా సంబోధించాలా? అన్న సమస్య! ఎందుకంటే, బాలయ్యతో  జగపతి బాబుకు అంతగా స్నేహం  లేకపోవటంతో ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. 

"అందుకే, ఓ రోజు డైరెక్ట్ గా బాలయ్య వద్దకు వెళ్లి 'మిమ్మల్ని ఎలా పిలవాలో నాకు తెలియడం లేదు. అందుకని ఎలా పిలవాలో మీరే చెప్పండని అడిగినట్లు సమాచారం. దీంతో బాలయ్య పెద్దగా నవ్వేసి, 'బాలయ్యా... అని పిలవండి పర్వాలేదు' అన్నారు. 

అయితే జగపతి బాబుకు మాత్రం అలా పిలవాలనిపించలేదట. ఎందుకంటే, జగపతి బాబు దృష్టిలో బాలయ్య అంటే  చాలా గౌరవం. బాలయ్యని బాగా అభిమానిస్తాను, గౌరవిస్తాను. అందుకే, మీరు అంటూనే సంబోధిస్తున్నాను" అని చెప్పారు జగపతిబాబు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles