Amitabh bachchan crosses 10 million likes on facebook

Amitabh Bachchan, Facebook, 10 million Facebook followers, Amitabh Bachchan tweeted,Shah Rukh Khan.

Amitabh Bachchan crosses 10 million likes on Facebook, Amitabh Bachchan reaches 10 million Facebook followers

మరో మైలురాయి దాటిన అమితాబ్?

Posted: 03/06/2014 10:43 AM IST
Amitabh bachchan crosses 10 million likes on facebook

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి తన స్థాయిని నిరూపించుకొన్నాడు. ఇండియాలోని ప్రముఖులలో కెల్లా అమితాబ్ అత్యంత ప్రముఖుడని నెటిజన్లు నిరూపించారు. తాజాగా బిగ్ బి అరుదైన ఘనత సాధించారు. సామాజిక సంబంధాల వెబ్ సైట్లలో చురుగ్గా వ్యహరిస్తున్న బిగ్ బీ మరో మైలురాయి అందుకున్నారు. 

సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో అమితాబ్ ను ఫాలో అవుతూ 'లైక్' చేసిన వారి సంఖ్య తాజాగా కోటికి చేరుకుంది. 'వాహ్ పది మిలియన్లు' అంటూ అమితాబ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. తన ఫేస్ బుక్ అకౌంట్ పది మిలియన్లకు చేరుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పారు.

అంతేకాదు అటు ట్విటర్ లోనూ 80 లక్షల మార్కును అధిగమించాడు అమితాబ్. బాలీవుడ్ లో యాక్టివ్ బ్లాగర్ గా ఉన్న ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య 80 లక్షలు దాటింది. ఈ సందర్భంగా తన అభిమానులకు అమితాబ్ ధన్యవాదాలు తెలిపారు. 

ఇలా 70 లక్షల మంది ఫాలోవర్లతో భారత్ లో అత్యంత క్రేజీ సెలబ్రిటీగా నిలిచాడు. సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖులెందరో పోటీపటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్ల అకౌంట్లను ఓపెన్ చేసి తమ కు తోచిన కబుర్లు చెబుతున్న తరుణంలో వారిలో ఎవరికి క్రేజ్ ఎక్కువగా ఉంది అనే పోటీ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరోలందరి కంటే ఎంతో ముందున్నాడు అమితాబ్.

తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకునేందుకు ట్విటర్ ను అమితాబ్ వేదిక చేసుకున్నాడు. ప్రత్యేక సందర్భాల్లో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ట్విటర్ ద్వారానే అమితాబ్ తెలుపుతున్నారు. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles