10 lakhs fine on shekar kammula

Shekar Kamula, MM.Keeravani, Nayantara, production house Endamol,

Shekar Kamula has paid a fine of 10 Lakhs to the producers of this movie.

శేఖర్ కమ్ములకు పది లక్షల ఫైన్

Posted: 03/04/2014 08:21 PM IST
10 lakhs fine on shekar kammula

టాలీవుడ్ లో ఇంటలెక్చువల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల సినిమాలు చాలా నెమ్మదిగా చేస్తాడనే పేరుంది. ‘అలస్యం అవ్రుతం విషం ’ అనే సామెత మాదిరి ఈ దర్శకుడికి ఆలస్యం విషంగా మారింది. ఇటీవల ఈయన తెరకెక్కించిన ‘అనామిక ’ షూటింగును అనుకున్న టైంలో పూర్తి చేయనందుకు సదరు నిర్మాణ సంస్థ ఈయన చేత పది లక్షల ఫైన్ కట్టించుకుందట.

ఈ సినిమాని ఎండమోల్ ఇండియా లాగ్ లైన్ ప్రొడక్షన్స్ అనే ముంబై కార్పోరేట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సంస్థతో ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం యాభై అయిదు రోజుల్లోనే సినిమా తీయాలి. కానీ అనుకున్న దానికంటే వారం రోజులు ఎక్కువ సమయం పట్టడంతో ఆ వారం రోజులకు అయిన ఖర్చును  ప్రొడక్షన్ కాస్ట్ ని డైరెక్టర్ నే భరించమని మొహమాటం లేకుండా చెప్పేశారట. దీంతో శేఖర్ కమ్ముల ఆ ఖర్చును భరించాడట.

ఈ విషయం తెలుసుకున్న తెలుగు నిర్మాణ సంస్థలు తమతో చెప్పిన టైం కంటే శేఖర్ కమ్ముల నెలలకు నెలలే డీలే చేశాడు. వాటికి మేమెంత ఫైన్ వేయాలి. ఆ లెక్కన చూసుకుంటే తెలుగులో సినిమాల్ని శిల్పంలా చెక్కే జక్కన్నకు ఇంకెంత ఫైన్ వేయాలి అని అనుకుంటున్నారు. పరిస్థితుల ప్రభావమో లేక ఇంకేదైనా కారణమో కానీ వారం రోజులు డిలే అయినందుకు పది లక్షలు ఫైన్ వేయడం సరికాదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles