Pawan kalyan in walk for heart program

pawan kalyan in walk for heart program, Walk For Heart Reach For Heart program, Pawan Kalyan, Anurag Sharma, Trivikram Srinivas

pawan kalyan in walk for heart program, Walk For Heart Reach For Heart program

పవన్ కళ్యాణ్ ఆరోగ్య రహస్యం

Posted: 03/02/2014 11:21 AM IST
Pawan kalyan in walk for heart program

ఈ రోజు ఆరోగ్యం కోసం నడక కార్యక్రమంలో హీరో పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరూ అనునిత్యం వ్యాయామం చెయ్యాలని, దాని వలనే మనిషి నిత్యం ఆరోగ్యంతో ఉండగలుగుతాడని, ఆరోగ్యం బాగుంటేనే ఆలోచనలు కూడా బాగుంటాయని, మంచి ఆలోచనలే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాయని, ఆహార అలవాట్లలో అవగాహన పెంచుకుని అందులో తగు మార్పులు చేసుకుని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండెకు సంబంధించిన వ్యాధులు దగ్గరకు రాకుండా అరికట్టవచ్చని అన్నారు. 

నెక్లెస్ రోడ్డు పివి ఘాట్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు హృదయ స్పందన ఫౌండేషన్ నిర్వహించిన వాక్ ఫర్ హార్ట్- రిచ్ ఫర్ హార్ట్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఈ కార్యక్రమాన్ని పారంభించారు.  ఇందులో విద్యార్థులు, వైద్యులు, ఇతర రంగాలలోని ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుండె వ్యాధులు వాటి నివారణల గురించి అవగాహన కలుగజేస్తూ, నడక వలన గుండె కు సంబంధించిన వ్యాధులను నివారించే ఉపాయాన్ని అందరకూ తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles