పవన్ కళ్యాణ్ సినిమా కోసం .. టాలీవుడ్ సినీజనాలు, ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అత్తారింటికి దారేది తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని చకోర పక్షలు మాదిరి ఓపిగతో వేచి చూస్తున్నారు.
అయితే నిత్యం పవన్ కళ్యాణ్ గురించి టాలీవుడ్ నుండి ఏదో ఒక న్యూస్ బయటకు వస్తునే ఉంది. ఇలాంటి సమయంలో ఏ వార్త నిజమో, ఏ వార్త పుకారో తెలియక అభిమానులు అల్లాడిపోతున్నారు.
ఈ మధ్య కాలంలో.. పవన్ కళ్యాణ్ పై గాచిప్ ఎక్కువుగా వినబడుతున్నాయి.. ప్రింట్ మీడియాలో కూడా.. పుకార్లు పుడుతున్నాయి. అయితే వీటిపై పవన్ కళ్యాణ్ ఏ రోజు స్పందించలేదు.
అయితే లేటెస్ట్ గా.. పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరంలో చాలా బిజి బిజీగా షూటింగులతో గడుపుతాడని .. ఫిలింనగర్ వాసులు అంటున్నారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుల్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి, ఆయన కాల్షీట్ల కోసం నిర్మాతలు ఎగబడుతున్నారు. ఇక దర్శకులు కూడా పవన్ ని ద్రుష్టిలో ఉంచుకొని కథలు రాసున్నారు. అయితే పవన్ చేతిలో ప్రస్తుతం ఉన్నవి రెండే సినిమాలు.
ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై వస్తున్న పుకార్లకి తెరదించుతూ ఆయన రెండు సినిమాలు సైన్ చేసారు. అందులో ఒకటి ‘ఓ మై గాడ్’ రీమేక్ అయితే రెండవది గబ్బర్ సింగ్ 2. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ చెప్పినట్లు సమాచారం.
ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి అతి త్వరలో మొదలు కానున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా రెండు సినిమాలకు ఒకే సారి పనిచేయనున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ చాలా కథలు వింటున్నాడు కానీ ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు.
ఓ మల్టీ స్టారర్ సినిమాలో పవన్ కలయన్ నటిస్తుండడం పవన్ అభిమానుల్లో, సినీ అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది. ఈ ‘ఓ మై గాడ్’ రీమేక్ విజయం అందుకుంటే మిగిలిన పెద్ద హీరోలు కూడా మల్టీ స్టారర్ వైపు అడుగేసే అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం నిర్మాతలు, దర్శకుల ద్రుష్టి మొత్తం పవన్ కళ్యాణ్ మీదనే ఉంటుంది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more