Venkatesh pawan movie title ori devuda

Oh My God Telugu remake titled Ori Devuda, Venky exclaims to Pawan - Ori Devuda, Venkatesh and pawan Kalyan movie Ori devuda, Pawan kalyan and venkatesh Multistarrer,Ori devuda movie,

Oh My God Telugu remake titled Ori Devuda, Venky exclaims to Pawan - Ori Devuda, Venkatesh and pawan Kalyan movie Ori devuda, Pawan kalyan and venkatesh Multistarrer,Ori devuda movie,

వెంకీ - పవన్ టైటిల్ ఇదే

Posted: 02/16/2014 06:31 PM IST
Venkatesh pawan movie title ori devuda

టాలీవుడ్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ సినిమా  వెంకీ, మహేష్ లతో  మొదలైన మల్టీ స్టారర్ ట్రెండ్ ఇప్పుడు ఊపందుకుంది. ఆ సినిమా తరువాత వెంకీ, రామ్ జంటగా ‘మసాలా ’ చిత్రం వచ్చింది. ఇప్పుడు పలు ఫ్యామిలీ మల్టీ స్టారర్ చిత్రాలే కాకుండా, రామ్ చరణ్ చేసే మల్టీ స్టారర్ చిత్రం కూడా సెట్స్ పై ఉంది. అదీ కాకుండా వెంకటేష్ , పవన్ కాంబినేషన్లో బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఓ మై గాడ్ ’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుందని అధికారిక ప్రకటన కూడా చేశాడు సురేష్ బాబు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో పవన్ వేసే క్రుష్ణుడి పాత్రకు భారీ పారితోషికం కూడా ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ కూడా సురేష్ బాబు ఫిలిం చాంబర్ లో రిజిష్టర్ చేసినట్లు సమాచారం.

ఫిలింనగర్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి టైటిల్ గా ‘ఓరి దేవుడా ’ రిజిష్ట్రర్ చేశారని అంటున్నారు. డాలి దర్శకత్వం వహించబోతున్న ఈచిత్రం టైటిల్ ఇదా కాదా అనేది అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ ని సంప్రదించినట్లు, దానికి ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చికూడా వచ్చినట్లు చెబుతున్నారు.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles