Hero sunil guest role in baahubali

baahubali, rajamouli, prabhas, mahabali, Hero sunil guest role in baahubali

Now the recent buzz is that Sunil is keen to do a guest role for Baahubali in his favorite director Rajamouli direction.

బహుబలిలో సునీల్ కూడా?

Posted: 01/24/2014 12:26 PM IST
Hero sunil guest role in baahubali

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు బడ్జెట్ ముందే ఇంత అంతా అని ఉండదు. సినిమా పూర్తయ్యే వరకు ఎంత అవుతుందో అదే ఫైనల్ బడ్జెట్. అలానే తన సినిమాలో తాను అనుకున్న పాత్రల కోసం ఎంత మందినైనా తీసుకోవడానికి వెనకాడరు. ప్రస్తుతం చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘బహుబలి ’ లో కూడా క్యాస్టింగ్  పరంగా వెనకాడరు. ఇప్పటికే భారీ తారాగణం ఉన్న ఆ సినిమాలో ఇప్పుడు మరో నటుడు సునీల్ ని కూడా తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. జానపద చిత్రం కావడంతో బోలెడన్ని పాత్రలకు ఆస్కారం ఉండటంతో ఓ ముఖ్యమైన పాత్ర చేయాలని రాజమౌళి సునీల్ అడిగే సరికి కాదనలేక ఒప్పేసేకున్నాడట.

గతంలో ‘శ్రీరామదాసు ’ సినిమాలో సునీల్ వేసిన వేషం బాగా కుదరడంతో మళ్ళీ అలాంటి పాత్రే ఇందులో వేయబోతున్నాడని అంటున్నారు. సునీల్ ని హీరోగా హైలెట్ చేసిన జక్కన్న మాట సునీల్ కాదంటాడా ? గతంలో చాలా మంది ప్రముఖ నటులు నటిస్తున్నారని గాలి వార్తలు వచ్చిన సమయంలో జక్కన్న వాటికి క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు సునీల్ ఉన్నడంటూ వస్తున్న వార్తల పై కూడా స్పందిస్తే నిజమేంటో తేలిపొతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles