1 remake confirmed with aamir khan

Aamir Khan, Nenokkadine, 1 movie remake, Mahesh babu, 1 Nenokkadine rmeake, Nenokkadine remake, Nenokkadine mvoie remake in bollywood, tollywood, bollywood, Nenokkadine movie Hindi remake, Nenokkadine hindi remake, Nenokkadine remaked by aamir in bollywood, Aamir Khan, News, 1-Nenokkadine,

Director Sukumar has directed this movie. The makers are planning to remake this movie in Hindi. For this Bollywood Mr.Perfect Aamir Khan will play the lead role and the talks are underway.

సుక్కు దర్శకత్వంలో అమీర్ ఖాన్

Posted: 01/22/2014 06:42 PM IST
1 remake confirmed with aamir khan

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన ‘1’ సినిమా జనాలకు అంతగా రీచ్ కాకపోయినా, సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందని, దర్శకుడి దర్శకత్వ ప్రతిభను చాలా మంది మెచ్చుకున్నారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురింపించక పోయినా, ప్రశంసల వర్షం కురిసే సరికి దర్శకుడు సుకుమార్, హీరో మహేష్ బాబు తెగ హ్యాపీగా ఫీలవ్వడమే కాకుండా మరో సినిమా కూడా చేద్దామని సందేశాన్ని ఇచ్చాడంటే సుక్కు దర్శకత్వానికి ఎంత ముగ్దుదయ్యాడో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఇదే సినిమాను లబాలీవుడ్ లో రీమేక్ కాబోతుందని, ఈ సినిమాలో నటించడానికి అమీర్ ఖాన్ ఆసక్తి చూసిస్తున్నాడని, దీనికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రామ్ సూఛాయగా చెప్పారు. దాని రీమేక్ కి సంబంధించిన ప్రాసెస్ నడుస్తుందని అన్నారు.

ఇక దర్శకుడు కూడా బాలీవుడ్ లో రీమేక్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, తన సినిమాలో అమీర్ ఖాన్ లాంటి వారు నటిస్తానంటే అంతకంటే ఏం కావాలని సుకుమార్ అంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఈ సినిమా రీమేక్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles