Namita enter in to politics

namita, namita political entry, vijayakanth, jayalalitha, namita fans, namita temple

namita enter in to politics

రాజకీయాల్లో సత్తా చూపిస్తా : నమిత

Posted: 01/16/2014 10:00 AM IST
Namita enter in to politics

 

తన అందచందాలతో దక్షిణాదిని ఒక ఊపు ఊపిన అందాల బొద్దుగుమ్మ నమిత తాను త్వరలో  ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి తన సత్తానంతా చూపిస్తానని అంటోంది.  ఇందుకోసం  ఇప్పటికే పలు పార్టీల నాయకులను కలుసుకుంది. అసలు ఈ అమ్మడి ఫ్యాన్స్ గురించి  చెప్పాలంటే ఆ కథే వేరు. జయలలిత, ఖుష్బు ల కోవలో అంతటి పేరు సంపాదించిన నమితకు  ఆమె ఫ్యాన్స్ గుడికడతామని  అన్నారు.

అయినా  ఆమె సున్నితంగా  తిరస్కరించారు. సౌత్ లో ఎంతో పేరు సంపాదించిన  ఆమె ఇకపై రాజకీయాల్లోకి రావాలనుకుంటోంది. అక్కడా తన ఇమేజ్ ను చాటేందుకు  ఆమె పార్లమెంట్ ఎన్నికలలోపు  ఏదో ఒక పార్టీలో చేరతానంది.  ఇందుకోసం  ఇప్పటికే ఆమె జయలలిత , విజయ్ కాంత్ లను పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది.

అలాగే రాజకీయాల్లో చేరేందుకే సినిమాలను తగ్గించు కున్నానని.ఇకపై అధిక సమయం  రాజకీయాలకే కేటాయిస్తానని  చెబుతోంది. తన పొలిటికల్  ఎంట్రీ అనంతరమే  పెళ్లి చేసుకుంటానని  ఈ అమ్మడు సెలవిస్తోంది.  సో... ఇకపై మనం ఈ అమ్మడిని రాజకీయ తెరపై చూడొచ్చునన్నమాట.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles