Mahesh babu counters samantha tweet

Mahesh Babu, 1-Nenokkadine, samantha, Mahesh Babu counter attack

1-Nenokkadine poster controversy instigated by Samantha and now, after the film release, Mahesh Babu has countered Samantha tweet.

సమంతాకు కౌంటర్ ఇచ్చిన మహేష్ బాబు

Posted: 01/15/2014 03:26 PM IST
Mahesh babu counters samantha tweet

మహేష్ బాబు సినిమాల్లో ఎంత సైలెంటుగా సెటైర్లు వేస్తాడో నిజ జీవితంలో కూడా అంతే సైలెంటుగా పంచ్ ఇచ్చాడు బ్యూటీ సమంతాకు. వీరిద్దరి మధ్య ‘1’ నేనొక్కడినే సినిమాకు సంబంధించిన పోస్టర్ వివాదం ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్యన సమంతా మహేష్ సినిమా పోస్టర్ పై ట్విట్టర్లో కామెంట్ చేసి వివాదానికి తెర లేపితే... సమంతాకు సపోర్టుగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా సపోర్ట్ ఇచ్చాడు.

దానికి కౌంటర్ గా మహేష్ ఓ ఛానల్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ... సమంత అలా ట్వీట్ చేయాల్సి ఉండకుండా తమ దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు తీసుకునే వారమని,  సమంత తన భార్య నమ్రతతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందని.. కనీసం ఆమె  దృష్టికి తీసుకువచ్చినా బాగుండేదని అన్నారు.

క్రియేటివ్ ప్రాసెస్ లో పోస్టర్ డిజైన్ లో దొర్లిన తప్పు తమ దృష్టికి రాలేదని మహేశ్ తెలిపారు. మహేష్ ఇంత ఆలస్యంగా స్పందించినా మహేష్ పంచ్ తో సమంతాకు దిమ్మ తిరిగిందని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. దీని పై ఎలాంటి ట్వీట్ చేస్తుందో ఈ ముద్దుగుమ్మ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles