Pawan attend customs south zone cultural festival

Pawan Kalyan, Customs south zone cultural festival, Customs, Excise and Service Tax department, Pawan Kalyan attends Customs department festival, Bharatiya Vidya Bhavan, King Koti

Pawan Kalyan attended the Customs department Cultural South Zone meet festival at Bharatiya Vidya Bhavan in King Koti.

రెండు పనులు నిర్వహించడం గొప్ప విషయం : పవన్

Posted: 01/09/2014 09:50 AM IST
Pawan attend customs south zone cultural festival

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా పబ్లిక్ ఫంక్షన్లకు , సినిమా వేడుకలకు గానీ గతంలో చాలా తక్కువగా హాజరయ్యేవాడు. కానీ గత కొంత కాలంగా వివిధ కార్యక్రమాలకు, ఫంక్షన్లకు హాజరవుతూ వస్తున్నాడు. ఆ మధ్యన 18 అంతర్జాతీయ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమానికి హాజరయ్యి అందర్నీ అలరించాడు. ఇప్పుడు కింగ్ కోఠిలోని భారతీయ విధ్యాభవన్ లో కస్టమ్స్, కల్చరర్ ఎక్సైజ్ అండ్ సర్విస్ ట్యాక్స్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ కల్చరర్ మీట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఉద్యోగం చేసుకుంటా సాంస్ర్కుతిక కార్యక్రమాల్లో పాల్గొనడం గొప్ప విషయమని అన్నారు. పవన్ ని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తే వెళ్లడం సర్వసాధారణమే కదా ? దీనికి ఎందుకింత హంగామా అనుకుంటారా ? అసలు విషయం ఏంటంటే... గత కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మూడో పెళ్ళి వార్తలు మీడియాలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వార్తలు వచ్చినప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఇలా ఎప్పుడు బయటకు రాలేదు.

ఆ మధ్యన ‘రేయ్ ’  ఆడియో పోస్ట్ పోన్ కావడానికి పవన్ కారణమని, ఒకవేళ మీడియా ముందుకు వస్తే నిజాల్ని ఎక్కడ చెప్పాల్సి వస్తుందేమోనని భయంతో రాలేదని కొందరు విమర్శించారు కూడా. మరి వారందరి నోళ్ళు మూయిస్తూ ఆ వార్తల తరువాత పవన్ ఇలా కనిపించడం హైలెట్. అంతే కాదండోయ్ ఈనెల 17న రేయ్ ఆడియోకి వస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles