Kochadaiyaan release date april 14

Kochadaiyaan elease date, April 14, Tamil New year, Rajinikanth and Deepika Padukone, Kochadaiiyaan Audio Release feb 15, Rajinikanth Kochadaiyaan

This film release date might be postponed to Tamil New year which falls on 14th April 2014.

కొచ్చాడయాన్ విడుదల తేదీ ఖరారు

Posted: 01/05/2014 04:23 PM IST
Kochadaiyaan release date april 14

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో చేస్తున్న ‘కొచ్చాడయాన్ ’ సినిమా గత రెండేళ్ళుగా ప్రేక్షకుల ముందుకు రావాలా ? వద్దా అని దోబూచులాడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు మరో మూడు నెలల తరువాత అంటే ఏప్రిల్ 14వ తేదీన తమిళ సంవత్సరాది పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇప్పటికే చాలా రోజుల నుండి వాయిదాలు వేస్తూ వస్తున్న ఈ సినిమా  ఆడియోను కూడా ఫిబ్రవరి 15 వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో హక్కుల్ని ప్రముఖ కంపెనీ సోని మ్యూజిక్ ఈ ఆడియో కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇన్ని రోజులు వాయిదా పడటానికి ఈ సినిమాకు భారీ గ్రాఫిక్స్ ఉండటమే అని, ఆ పని వల్లే వాయిదా పడుతూ వచ్చిందని, ఈ సినిమాలో ఎలాంటి సూక్ష్మ లోపాలు లేకుండా జాగ్రత్తగా తీర్చి దిద్దుతున్నారని సమాచారం. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లోనే కాకుండా సినిమా ఇండస్ట్రీ వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘విక్రమసింహా ’ పేరుతో విడుదల కానుంది. కానీ సినీ జనాలు మాత్రం ఈ సినిమా ఆరోజైనా విడుదల అవుతుందో లేదో చూడాలంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles