Attarintiki daredi 100 days celebrations posters

attarintiki daredi 100 days, pawan kalyan, samantha, bvsn prasad, trivikram srinivas, Attarintiki Daaredi 100 days Posters, Pawan Kalyan Atharintiki daredi Movie, 100 Days Posters, 100 Days Celebrations posters

Pawan Kalyan Telugu film Attarintiki Daredi, which is directed by Trivikram Srinivas, is set to complete 100 days run in 32 theatres.

అత్తారింటికి 100 మాటేమిటి ?

Posted: 01/04/2014 09:36 AM IST
Attarintiki daredi 100 days celebrations posters

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బీవీయస్ ఎస్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా టాలీవుడ్ పెద్ద ఘన విజయాన్ని సాధించి ఇండస్ట్రీలోని ఆల్ టైం రికార్డుల్ని బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27 న విడుదల అయిన ఈ సినిమా 32 సెంటర్లలో 100 రోజులు  పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.... ‘100 సంవత్సరాల చరిత్ర ... 100 రోజుల వేడుక ’ పేరుతో వాల్ పోస్టర్ ని విడుదల చేశారు. తొలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం దేశ, విదేశాల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత ఆ సినిమా కలెక్షన్ల గురించి కానీ, ఎంత వసూలు చేసిందనేది మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు.

టాలీవుడ్ లో తొలిసారి వంద కోట్ల కబ్బులోకి వెళుతుందని డబ్బా కొట్టుకున్న చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు మాత్రం ఆ మాటెత్తలేదు. వందరోజులైతే పూర్తి చేసుకుంది కానీ, వందకోట్ల మాటేమిటి అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. సినీ ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం

ఈ  సినిమా మగధీర కలెక్షన్లను బీట్ చేసి, అధనంగా మరో 5 కోట్లు వసూలు చేసిందని, అంటే మొత్తంగా 85 కోట్లు మాత్రమే రాబట్టిందని, వంద కోట్ల క్లబ్బుకు చేరడం అసాధ్యం అని అంటున్నారు. మరి టాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్బును తాకే తొలి సినిమా ఏదవుతుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles