John abraham secretly married to girlfriend

John Abraham girlfriend, John Abraham married, Priya Runchal, Priya Abraham,John Abraham,Bipasha Basu, Madras Cafe, John and Priya Abraham

John Abraham sent rumour mills soaring with news of his alleged marriage after he tweeted "Wishing you and your loved ones a blessed 2014.

బిపాసా మాజీ లవర్ పెళ్ళి చేసుకున్నాడు

Posted: 01/03/2014 06:50 PM IST
John abraham secretly married to girlfriend

గతంలో డస్కీ బ్యూటీ బిపాసా బసు తో పీకల్లోతు ప్రేమలో మునిగి అచ్చట ముచ్చట తీరిన తరువాత పెళ్లి చేసుకునే టైంలో ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోయిన జాన్ అబ్రహం ఆ తరువాత ప్రియా రాంచల్ అనే యువతితో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నాడని, వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారని ఆ మధ్యలోనే వార్తలు వచ్చినా వాటిని ఖండిస్తూ వచ్చిన జాన్ ఎట్టకేలకు వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, పెళ్లి విషయాన్ని ట్విట్టర్ ద్వారా బయట పెట్టాడు.

గత కొంత కాలం క్రితమే వీరి వివాహం అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగినట్లు తెలిపాడు. ప్రస్తుతం ప్రియాతో కలిసి జాన్ అబ్రహం అమెరికాలో పర్యటిస్తున్నారు. ముంబైలో ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేసే ప్రియా, జాన్ అబ్రహంల మధ్య ప్రేమ వ్యవహారం  2010 నుంచి నడుస్తోంది.

జాన్ అబ్రహం, ప్రియా రాంచల్ మధ్య పరిచయం ముంబై బాంద్రలోని ఓ జిమ్‌లో ఏర్పడిందని తెలుస్తోంది. ఆ పరిచయం ప్రేమగా మారిన తరువాత వీరిద్దరు కలిసి చెట్టాపట్టాల్ వేసుకొని బహిరంగంగానే తిరిగారు కూడా. జాన్ తో విడిపోయిన తరువాత బిపాసా ఎందుకు విడిపోయామనే దాని పై స్పందించలేదు.

మరి ఇప్పుడు జాన్ వివాహం అయ్యింది కాబట్టి వీరి ప్రేమ బ్రేకప్ ఎందుకయ్యిందనే దాని పై ఇప్పుడైనా నోరు విప్పుతుందో లేదో చూడాలి. జాన్ అబ్రహం దంపతులకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles