Hero sunil as cancer patient

Hero Sunil cancer patient, Sunil, Bheemavaram Bullodu, Andala Ramudu, Maryada Ramanna, Poola Rangadu.

Comedian turned hero Sunil will be seen as a cancer patient but in his forthcoming Telugu film Bheemavaram Bullodu.

హీరో సునీల్ క్యాన్సర్ పేషెంట్ గా ?

Posted: 01/03/2014 04:14 PM IST
Hero sunil as cancer patient

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి కమేడియన్ గా వచ్చి ఆ తరువాత హీరోగా మారి ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సునీల్ త్వరలో ప్రేక్షకులకు కేన్సర్ పేషెంట్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈయన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఉదయ్ శంకర్ దర్శకత్వంలో ‘భీమవరం బుల్లోడు ’ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించి ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో సునీల్ క్యాన్సర్ పేషెంటుగా కనిపించబోతున్నాడని సమాచారం. తన మొదటి సినిమా ‘అందాల రాముడు ’ తో హిట్టు కొట్టి ఆ తరువాత చాలా సంవత్సారాలు గ్యాప్ తీసుకున్న సునీల్ ఇటీవల తడాఖా, మిస్టర్ పెళ్లి కొడుకు సినిమాల్లో నటించాడు. అవి అనుకున్నంత విజయాన్ని ఇవ్వకపోవడంతో, ఈ చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నాడు.

దీని పై ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకున్నాడంటే... గతంలో హీరోలు క్యాన్సర్ పేషెంట్లుగా నటించిన పలు చిత్రాలు హిట్టయిన నేపథ్యంలో....ఈ కాన్సెప్టు కలిసొస్తుందని భావిస్తున్నారు. అటు ఉదయ్ శంకర్ కూడా చాలా రోజుల తరువాత మళ్ళీ దర్శకత్వం వహిస్తుండటంతో మంచి కథా బలం ఉండబట్టే సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles