Actor manchu manoj injured as road accident

Actor Manchu Manoj injured as Road Accident , manchu manoj, tollywood hero, road accident, road accident in hyderabad, Manchu Manoj injured as Road Accident

Actor Manchu Manoj injured as Road Accident , manchu manoj, tollywood hero, road accident, road accident in hyderabad, Manchu Manoj injured as Road Accident

కారు ప్రమాదం నుండి బయట పడిన మనోజ్

Posted: 12/09/2013 11:43 AM IST
Actor manchu manoj injured as road accident

ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ నిన్నరాత్రి హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డులో జరిగిన కారు ప్రమాదం నుండి త్రుటిలో బయట పడ్డాడు. ఈయన జూబ్లీ హిట్స్ నుండి శంశాబాద్ ఎయిర్ పోర్టుకు వెళుతుండగా ఈయన ప్రయాణిస్తున్న కారు అప్పా జంక్షన్ వద్దకు చేరుకోగానే గేదెలు అడ్డు రాడంతో సడెన్ బ్రేక్ లు వేయడంతో కారు పల్టీలు కొట్టింది.

ఈ ప్రమాదంలో మనోజ్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఈయన్ను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంచు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్యం పై ఆరా తీశారు. మనోజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలపడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యం అనంతరం ఆయన ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయం పై మోహన్ ని అడగ్గా.. అభిమానుల ఆశీస్సులతోనే మనోజ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

గతంలో కూడా ఔటర్ ప్రమాదాల్లో చాలా మంది ప్రముఖుల కుమారులు మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఔటర్ పై ప్రమాదాలకు కారణం నిషేధిత ప్రాంతాల నుంచీ పశువులు, ఇతర వాహనాలు ఔటర్‌పైకి రావడంతో పాటు ఈ రోడ్డుపై ఎక్కడా దీపాలు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ప్రమాదాలను నివారించాలని కోరతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles