Director ram gopal varma fight on censor board

Director Ram gopal varma Fight on censor board, RGV to file a complaint against censor officer, ram gopal varma, criminal case, censor board, dhanalakshmi, satya 2, satya 2 release

Director Ram gopal varma Fight on censor board, RGV to file a complaint against censor officer

ధనలక్ష్మిపై కేసు పెడతా ?

Posted: 11/09/2013 09:20 PM IST
Director ram gopal varma fight on censor board

సత్య-2 హ్యాండివ్వడంతో షాక్ తిన్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ కోపాన్ని సెన్సార్ బోర్డుపై తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి గాను తాను ఇంతకు ముందు చేసిన తప్పును ప్రశ్నించిన సెన్సార్ బోర్డు సభ్యురాలు ధనలక్ష్మిని టార్గెట్ చేశాడు. సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెడతానని రామ్ గోపాల్ వర్మ హెచ్చరించారు. సత్య-2 కొన్ని చోట్ల విడుదల కాకుండా ఆమె అడ్డుకుంటున్నట్లు వర్మ ఆరోపించారు. ఈ సినిమా హిందీ భాషలో విడుదలయింది.

 

'సత్య-2'కు సంబంధించిన 'ట్రైలర్' ను వర్మ.. సెన్సార్ కు పంపించకుండానే మీడియాకు విడుదల చేశాడు. సాధారణంగా ఏ సినిమా అయినా.. సెన్సార్ అనుమతి లేకుండా ఎలాంటి ట్రైలర్ లను విడుదల చేయడానికి లేదు. కానీ వీటన్నిటిని పక్కన పెట్టిన వర్మ 'సత్య2' మూవీకి సంబంధించిన ఓ ట్రైలర్ ను విడుదల చేశాడు.

 

ఈ విషయంలో ధనలక్ష్మి ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆమె గురువారం సినిమా సెన్సార్ కు సంబంధించి నిర్మాతకు ఇబ్బంది పెట్టినట్లు వర్మ చెబుతున్నారు. దాని మనసులో పెట్టుకున్న వర్మ తన సినిమా థియేటర్ల వద్ద బోల్తాకొట్టడంతో సెన్సార్ పై తన ఆగ్రహన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని సినీ విమర్శకులు వాదన. ఈ నేపథ్యంలో వర్మ.. ధనలక్ష్మిపై క్రిమినల్ కేసుకు సిద్ధమవడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles