Venkatesh ram charan multistarrer confirmed

Venkatesh-Ram Charan Multistarrer Official confirmation , Ganesh babu Official confirmation, enkatesh and Ram Charan, Krishna Vamsi film, Producer Ganesh Bandla, Venkatesh, Ram Charan

Official confirmation announced by Ganesh babu says Victory Venkatesh and Ram Charan are going to act in my movie.

వెంకీ - చరణ్ మల్టీ స్టారర్ ఉందట

Posted: 11/02/2013 09:07 AM IST
Venkatesh ram charan multistarrer confirmed

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రం సింగిల్ స్టారర్ చిత్రం అయిందని, ఈ సినిమా నుండి విక్టరీ వెంకటేష్ తప్పుకున్నాడని, కృష్ణవంశీ చెప్పిన కథ, అందులో వెంకటేష్ చేసే పాత్ర నచ్చక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని ఇటీవల రకరకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టడానికి ఆ చిత్రాన్ని నిర్మించబోయే నిర్మాత బండ్ల గణేష్ రంగంలోకి దిగి ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. కృష్ణవంశీ- చరణ్ - వెంకటేష్ కాంబినేషన్లో సినిమా చేస్తున్నామని, ఆ సినిమాను నేనే నిర్మిస్తున్నానని, ఈ సినిమా స్టోరీ విషయంలో ఏర్పడిన అడ్డంకులు అన్నీ తొలగిపోయామని, ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతుందని, ఇది ఖచ్చితంగా మల్టీ స్టారర్ చిత్రమే అని ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చాడు.

మొదట్లో తన పాత్ర నచ్చక వెంకటేష్ డ్రాప్ అయిన మాట నిజమేననీ, అయితే, మళ్ళీ ఆ పాత్రకు మార్పులు చేయడంతో ఆయన సంతృప్తి చెందాడనీ చెప్పుకొచ్చాడు. కాగా రాంచరణ్తో చేసే సినిమా వెంకటేష్కు మూడో మల్టీస్టారర్ చిత్రమవుతుంది. మహేష్ బాబుతో, రామ్తో కలసి మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించిన వెంకటేష్ ఇటు సోలో చిత్రాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles