‘కొత్త బంగారు లోకం ’ సినిమాతో కొత్త కొత్తగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాను కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించి మంచి ఘనవిజయం సాధించి, టాలీవుడ్ లో కనుమరుగు అయిన మల్టీ స్టారర్ చిత్రాల్ని ఈ జనరేషన్ వాళ్ళకి ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ’ సినిమాతో మళ్ళీ కొత్తగా పరిచయం చేసిన అందరి మన్నననుల పొందిన శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమా తరువాత ఇంత వరకు ఏ సినిమాను అనౌన్స్ చేయలేదు. ఆ మధ్యన నాగబాబు కొడుకుతో, పవన్ కళ్యాణ్ తో , చరణ్ తో సినిమా చేయబోతున్నాడని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు.
తాను రాసుకున్న కథలను పట్టుకొని స్టార్ హీరోల చుట్టూ తిరిగినా ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఇటీవలే ప్రిన్స్ మహేష్ బాబుకు అదే స్టోరీ వినిపించాడట. ఈ స్టోరీ విన్న వెంటనే మహేష్ శ్రీకాంత్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. సీతమ్మ వాకింట్లో చేస్తున్నప్పుడే శ్రీకాంత్ పని తనాన్ని మెచ్చిన మహేష్ మరో సినిమా తీస్తానని హామీ ఇచ్చాడట. ఇప్పుడు తనకు నచ్చిన కథను వినిపించిన వెంటనే ఒప్పేసుకున్నాడని, కాంత్ టాలెంట్, స్టైల్ ఆఫ్ డైరెక్షన్‌ని గుర్తించిన మహేష్ ఈ ఛాన్స్ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. మెగా హీరోల చుట్టు తిరిగి తిరిగి కాళ్ళరిగిన శ్రీకాంత్ ఇక వారితో సినిమాలు చేయవద్దని డిసైడ్ అయ్యాడని, అందుకే నాగబాబు కొడుకు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని అంటున్నారు.
ఇక మహేష్ తో ఈ సారి చేయబోయే సినిమా సింగల్ స్టార్ సినిమానే అని, ఈ సినిమాను మహేష్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్న 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ దీన్ని నిర్మించబోతుందని, ప్రస్తుతం మహేష్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి అయిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. మరి అప్పటి వరకు శ్రీకాంత్ ఖాళీగా ఉంటాడా ? లేక ఇంకేదైనా సినిమా చేస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more