Rudramadevi movie first look on anushka birthday

anushka, anushka varna movie trailer, anushka varna movie songs, varna movie release date, anushka upcoming movies

Releasing first look stills on the eve of the movie lead actor birthday is a new trend in Tollywood.

అనుష్కకు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్న గుణశేఖర్

Posted: 10/26/2013 12:57 PM IST
Rudramadevi movie first look on anushka birthday

టాలీవుడ్ లో క్రియేటివ్ అండ్ డైనమిక్ దర్శకుడిగా పేరొందిన గుణశేఖర్ ఒప్పప్పుడు స్టార్ హీరోలైనా మహేష్ లాంటి వారికి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించి నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. అలాంటి ఆయన గత కొంత కాలంగా తీస్తున్న సినిమాలు ప్లాపులు చవిచూడటంతో ఈయన క్రేజ్ అమాంతం పడిపోయింది.

ఈయనతో సినిమాలు నిర్మించేందకు ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో ఈయనే సొంతంగా నిర్మాణం చేపట్టి, భారీ బడ్జెట్ తో భారతదేశపు తొలి స్టీరియో స్కోపిక్‌ 3డి ‘రుద్రమదేవి ’ సినిమాను అనుష్కను పెట్టి తీస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని నవంబర్‌ 7న అనుష్క బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసి అనుష్కకు బర్త్ డే గిఫ్టుగా ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పటికే నెట్ లో హల్ చేస్తున్న కొన్ని అనుష్క ఫోటోలు ఒరిజనల్ వి కాదని, ఎవరో సృష్టించిన ఫొటోలు అని గుణశేఖర్ తెలిపారు.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించుచుండగా, ఆర్ట్‌ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణి, ఫోటోగ్రఫీ అజయ్‌ విన్సెంట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీతా లుల్లా(జోధా అక్బర్‌ ఫేం) లాంటి ప్రముఖులు ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. చూద్దాం గుణశేఖర్ చేస్తున్న ఈ భారీ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles