Nayantara in krishna vamsi multi starrer movie

Nayantara in Krishna Vamsi multi starrer movie, Nayanatara in Krishna Vamsi movie, Krishna Vamsi direction, Krishna Vamsi Multistarrer movie, Ramcharan-venkatesh

Nayantara has roped to play a heroine in Krishna Vamsi direction.This multi starrer movie starring Venkatesh and Ram Charan.

మల్టీస్టారర్ చిత్రంలో నయన్ ?

Posted: 10/19/2013 10:01 AM IST
Nayantara in krishna vamsi multi starrer movie

మొన్నటి వరకు సీనియర్ హీరోలతో నటించనని మడి కట్టుకొని కూర్చున్న నయనతారకు మళయాళ బ్యూటీ నయన తార అటు తమిళం, మళయాళం, ఇటు తెలుగు సినిమాల్లో కేవలం యువ హీరోల సరసనే నటించడానికి అంగీకరిస్తుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్న నయన్ కి టాలీవుడ్ లో వెంకటేష్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో కృష్ణ వంశీ భారీ మల్టీ స్టారర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్‌ని ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలిసింది. వెంకటేష్ సరసన నయనతారను నటించమని అడిగితే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ సినిమాలో నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఉందని అందుకే ఆమె ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. రామ్‌చరణ్‌కి బాబాయ్‌గా వెంకటేష్ నటిస్తున్నారని వినికిడి. యువ హీరోల సరనసే చేస్తానన్న నయన్ రామ్ చరణ్ కి పిన్నిగా నటించబోతుందని, అలా నటించినందుకు భారీగానే పారితోషికం వసూలు చేస్తుందని అంటున్నారు. పారితోషికం కంటే.. పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కథానాయికగా నయనకు పేరుంది. ఈ సినిమాలో పాత్ర కోసం కమీట్ అయిందో ? పైసల కోసం కమీట్ అయిందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం సూపర్ స్టార్ కృష్ణను అడగాగా ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ పాత్ర కోసం నాగబాబును తీసుకున్నట్లు చెబుతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్న ఈ చిత్రం వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles