Pawan kalyan attend attarintiki daredi sequel in plan

Pawan Attend Attarintiki Daredi sequel in planPawan Kalyan Attarintiki Daredi sequel plan, pawan kalyan,attarintiki daredi,sequel,trivikram srinivas, family audience

Pawan Attend Attarintiki Daredi sequel in planPawan Kalyan Attarintiki Daredi sequel plan, pawan kalyan,attarintiki daredi,sequel,trivikram srinivas, family audience

అత్తారింటికి మరో దారి వెతుకుతున్నారు

Posted: 10/17/2013 04:23 PM IST
Pawan kalyan attend attarintiki daredi sequel in plan

‘గబ్బర్ సింగ్ ’ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన తాజా సినిమా  ‘అత్తారింటికి దారేది ’ తో మరోసారి తన పవర్ ని చూపించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేటికి వసూళ్ళ సునామీతో దూసుకుపోతూ, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రికార్డుల్ని బద్దలు చేయడానికి సిద్ధంగా ఉంది.

గతంలో వచ్చిన జల్సా, ఇప్పుడు ఈ సినిమా హిట్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ గా ముద్ర పడింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు వీరిద్దరు ఈ సినిమా సీక్వెల్స్ పై కన్నేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం. తొలి పార్టు ముగింపులో అత్త తన నాన్న దగ్గరికి వచ్చి, అక్కడ అల్లుడిని కంపెనీ ఎండీగా చేయడానికి అంగీకరించడం వరకే సినిమాను ముగించారు.

ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కథను తయారు చేసే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడని, ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా, మానవ సంబంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగానే ఉంటుందని సినీ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్సే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles