Rajashekar grand daughter turns heroine

Rajashekar daughter debut, Shivani turn actor, Shivani first movie, Shivani act in jeevita directed movie, Rajashekar daughter Shivani Photos, Rajashekar daughter Shivani movie

Rajashekar grand daughter turns heroine under jeevitha direction.

జీవిత-రాజశేఖర్లు కూతుర్ని లాంఛ్ చేశారు

Posted: 09/20/2013 05:05 PM IST
Rajashekar grand daughter turns heroine

టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఒకప్పుడు హీరోగా పేరు మారుమోగి పోతే... ఆ మధ్య కాలంలో వివాదాలతో ఈయన పేరు మారుమోగి పోయింది. గత కొన్ని రోజుల నుండి ఇటు వెండి తెర పై, అటు రాజకీయాల్లో కనిపించకుండా పోయిన రాజశేఖర్ ఫ్యామిలీ ఇప్పుడు బట్టల వ్యాపారం చేసుకుంటూ కాలం గడుపుతుంది. ఆ మధ్యన వీరి ఫ్యామిలీ కలిసి బట్టల దుకాణం ఏర్పాటు చేశారు. ఆ సంగతి ప్రక్కన పెడితే... ప్రస్తుతం ఇండస్ట్రీకి వారసత్వాన్ని అందిపుచ్చుకొని వెండితెరకు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కానీ మన టాలీవుడ్ హీరోలు మాత్రం కూతుర్లను హీరోయిన్లుగా ప్రోత్సహించిన సందర్భాలు చాలా తక్కువ. కానీ రాజశేఖర్ మాత్రం తన పెద్ద కూతుర్ని హీరోయిన్ గా లాంఛ్ చేయబోతున్నాడు. ఆ మధ్య ఈయన నటించిన ‘మహాంకాళి ’ ఆడియోలో ఈమె చేత స్టేజ్ పై స్టెప్పులు వేయించి, ఇండైరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అప్పుడే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి నిజం అయ్యాయి. జీవిత-రాజశేఖర్ల ముద్దుల పెద్ద కూతురు ‘శివానీ ’ తన తల్లి జీవిత దర్శకత్వంలో రానున్న ‘వందకి వంద’ అనే మూవీలో శివానీ నటించబోతోంది. ఈ సినిమాలో  రాజశేఖర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడట. ప్రస్తుతం పదిహేడేళ్ళ వయస్సున్న ఈ అమ్మడు ఇందులో మొయిన్ రోల్ చేస్తుంది. చిన్న వయస్సులోనే వెండితెర అరంగ్రేటం చేసిన శివానీ టాలీవుడ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles