Ramoji rao admires ss rajamouli

Bahubali, Rajamouli, Ramoji film city, Ramoji Rao, Ramoji Rao letter to Rajamouli, Ramoji film city chairman letter to Rajamouli, Rajamouli receives appreciation from Ramoji Rao, Ramoji Rao praises Bahubali sets, Ramoji Rao praises Rajamouli, Bahubali working stills, Bahubali sets, Bahubali story

Ramoji Rao expressed that he absolutely admires Rajamouli attention to the most minute detail on the sets, which is a result of extensive.

జక్కన్నకు వంద అవార్డులు

Posted: 09/14/2013 02:28 PM IST
Ramoji rao admires ss rajamouli

టాలీవుడ్ దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళికి వంద అవార్డులు వచ్చాయి. ఆయన తీసింది కొన్ని సినిమాలే కదా ? ఇంత వరకు ఏ దర్శకుడి కూడా వంద అవార్డులు రావడం ఏంటి ? అనేగా మీ డౌట్. విషయం ఏంటంటే... ప్రస్తుతం రాజమౌళి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకమైన ‘బహుబలి ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగు కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ ను వేశారు. సెట్స్ ను చూసిన రామోజీ...  రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇటీవల తాను బాహుబలి షూటింగు జరుగుతున్న సెట్స్ కి వెళ్ళడం జరిగిందనీ, అక్కడ సెట్స్ రూపంలో సృష్టించిన కళా దృశ్యాలను చూసి, ఆ క్రియేటివిటీకి పరవశించిపోయాననీ రామోజీరావు రాజమౌళికి ఓ లేఖ ను పంపుతూ ప్రశంసించారు. అద్భుతమైన సెట్స్ వేసిన శిబు సిరల్ పనితనం ఎంతో ఆకట్టుకుందనీ, ఇంతటి అద్భుతమైన చిత్రం షూటింగు తమ ఫిలిం సిటీలో చేస్తున్నందుకు గర్వంగా ఉందనీ ఆయన పేర్కొన్నారు. ఈ లేఖ ను అందుకున్న రాజమౌళి ఇప్పుడు మేఘాల్లో తేలిపోతూ... ఆనందాన్ని తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. రామోజీ పంపిన లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ లేఖ నాకు వంద అవార్డుల తో సమానం అని చెప్పాడు. ఇదండీ వంద అవార్డుల సంగతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles