Telangana effect on sunil bheemavaram bullodu

Telangana effect on sunil-Bheemavaram Bullodu, sunil-Bheemavaram Bullodu, TG effect on Sunil, Sunil turns Dasara Bullodu now, Telangana issue forces Sunil

Telangana effect on sunil-Bheemavaram Bullodu, sunil-Bheemavaram Bullodu

తెలంగాణా దెబ్బకు మారిపోతున్న సినిమా టైటిల్స్

Posted: 08/20/2013 03:24 PM IST
Telangana effect on sunil bheemavaram bullodu

కమెడియన్ నుంచి హీరో గా మారిన సునీల్ కూడా తెలంగాణా వేడిని ఎదురుకోవాల్సి వచ్చింది.ఆల్రెడీ టాలీవుడ్ లో ప్రాంతీయవాదం చిచ్చురేపుతుంది.తెలంగాణా సినిమాలు, ఆంధ్ర సినిమాలు అని జనం వేర్వేరుగా చూడటం మొదలుపెట్టారు. సినిమా పేరులోనో, కథలోనో ఒక ప్రాంతాన్ని సమర్దించినట్లు కనపడితే ఆ సినిమాను ఒక ప్రాంత సినిమాగా ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం సునీల్ సినిమా కూడా ఇదే సమస్యను ఎదురుకుంటుంది. సురేష్ ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై సునీల్ క‌థానాయ‌కుడిగా `భీమ‌వ‌రం బుల్లోడు` పేరుతో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమా పేరు ఇప్పుడు `ద‌స‌రాబుల్లోడు`గా మార్చార‌ని తెలుస్తోంది. `భీమ‌వ‌రం బుల్లోడు` అని పేరు పెడితే ఇది ఆంధ్ర సినిమా అని తెలంగాణ వాళ్లు గొడ‌వ పెట్టే ప్రమాదం ఉంద‌ని గ్రహించిన చిత్రబృందం తాజాగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు స‌మాచారం. నైజామ్ డిస్ట్రిబ్యూట‌ర్ వ‌ర్గాలు కూడా ఇదే విష‌యాన్ని చెప్పాయ‌ట‌. ఏ ప్రాంతానికీ సంబంధం లేకుండా పేరు పెట్టమ‌ని చెప్పాయ‌ట‌. దీంతో హ‌డావుడిగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. సునీల్ భీమవరం ప్రాంతానికి చెందినవాడు కావటంతో ‘భీమవరం బుల్లోడు’ అని పెట్టారు.భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రాంతం కావటంతో ఇది ఆంధ్ర ప్రాంతం వాళ్ళ సినిమా అని తెలంగాణా వారు ఎక్కడ అడ్డుపడతారేమో అన్న భయంతో టైటిల్ మార్చారట.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles