Ravi teja making debut in bollywood

Ravi Teja Making Debut in Bollywood, Bollywood debut with Samir Karnik, Dhanush and Ram Charan, bollywood, dhanush, ram, charan

Latest buzz is that Telugu actor Ravi Teja is all set to make his Bollywood debut with Samir Karnik film.

రవితేజ కూడా వారితో చేరిపోయాడు

Posted: 08/12/2013 11:27 AM IST
Ravi teja making debut in bollywood

మొన్నటి వరకు వరుస సినిమా ప్లాపులతో సతమతం అయిన మాస్ రాజాకు ఇటీవలే వచ్చిన ‘బలుపు ’ సినిమా విజయం కాస్తంత ఊరట నిచ్చింది. ఈ సినిమా విజయంతో మాస్ రాజా తన పూర్వ వైభవాన్ని తిరిగి కొంత  పొందాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ తెర పై ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అయిపోయాడు. తన చదువునంతా అక్కడే కొనసాగించిన రవితేజకు నార్త్ లో మంచి గ్రిప్ ఉంది. అదీ గాక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ఆయనకు రోల్ మోడల్ . ఆయన తెలుగులో చేసిన సినిమాల్లో అమితాబ్ స్టైల్లో చేసిన పాత్రలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ పై అంత మక్కువ ఉన్న మాస్ రాజా బాలీవుడ్ తెరపై తళుక్కున మెరవనున్నారు. సమీర్ కర్ణిక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘కౌర్ అండ్ సింగ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని బాలీవుడ్ వర్గాల భోగట్టా. ఇందులో రవితేజ కవలలుగా నటించబోతున్నారట. తన అరంగ్రేట సినిమాలోనే ద్విపాత్రాభినయం చేయబోతున్న ఈ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తో తెర కెక్కబోతుందటట. త్వరలో సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్దం అవుతున్న ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే సౌత్ హీరోలు అయిన ధనుష్, రామ్ చరణ్ లు బాలీవుడ్ కి వెళ్లిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles