Krishna vamsi to direct mega hero

Ram Charan Movie with Krishnavamsi,Ram charan Zanjeer Movie Release,Ram charan Yevadu Movie Release,Ram charan Upcoming movies,Krishnavamsi Paisa Movie

ega Power star Ram Charan is going to pair up with creative director Krishna Vamsi.

కొడుకుతో కల తీరుబోతుంది

Posted: 07/24/2013 05:06 PM IST
Krishna vamsi to direct mega hero

సినిమా దర్శకులకు, హీరోలకు ఇండస్ట్రీలో కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలు కొందరికి కలలానే మిగిలిపోతాయి. కానీ  కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ కలలు తీర్చుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే...క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రిష్ణవంశీ తాను దర్శకత్వంలో అగుడు పెట్టినప్పటి నుండి మెగాస్టార్ తో ఒక్క సినిమా అయినా తీయాలనుకొని ఒకటి రెండు కథలు కూడా వినిపించాడు. కానీ పరిస్థితులు అనుకూలించ లేదు. తరువాత చిరు రాజకీయాలకు వెళ్ళడంతో ఇక సాధ్యం కాదనుకున్నాడు. కానీ ఆ కలను చిరు తనయుడు చరణ్ తో తీర్చుకోబోతున్నాడు. చరణ్ కోసం క్రిష్ణవంశీ ఓ పవర్ ఫుల్ కథను తయారు చేసే పనిలో పడ్డాడట. ఈ కథకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడట. చరణ్ కథ కోసం క్రిష్ణ వంశీ చాలా కష్టపడుతున్నాడట. ఇక చరణ్ కూడా మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం తాను నటించిన సినిమాలు విడుదలకు ఉన్నాయి. వాటి తరువాత చేతిలో ఒక్క ప్రాజెక్టు లేదు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న కొరటాల శివ మూవీ మధ్యలోనే అటకెక్కేసరికి ఇప్పుడు చరణ్ ఖాళీ ఉండే పరిస్థితి రావడంతో కాస్తంత మంచిగా ఉన్న కథతో వస్తే చరణ్ చేయడానికి రెడీ. ఇటు క్రిష్ణ వంశీ కూడా ఏ సినిమా చేయడం లేదు కాబట్టి వీరి సినిమా సెట్స్ కి వెళ్ళే ఛాన్స్ లే ఎక్కువ అంటున్నారు. ఇటీవలే సక్సెస్ గ్రాఫ్ పడగొట్టుకున్న వంశీ కూడా ఈ సినిమాతో మళ్లీ లైన్ లోకి రావాలని చూస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles