Mahesh babu 1 nenokkadine postponed to pongal

Mahesh Babu 1 (Nenokkadine) postponed to Pongal, Mahesh Babu Nenokkadine postponed to Sankranthi, Mahesh Babu Sankranthi sentiment, Mahesh Babu, Mahesh Babu 1, One, Nenokkadine, Gautham Krishna, Sukumar, Kriti Sanon, Devi Sri Prasad

Mahesh Babu 1 (Nenokkadine) postponed to Pongal, Mahesh Babu Nenokkadine postponed to Sankranthi, Mahesh Babu Sankranthi sentiment, Mahesh Babu, Mahesh Babu 1, One, Nenokkadine, Gautham Krishna, Sukumar, Kriti Sanon, Devi Sri Prasad

నేనొక్కడినే మళ్లీ వెనక్కి వెళ్లింది

Posted: 07/16/2013 10:29 AM IST
Mahesh babu 1 nenokkadine postponed to pongal

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘1’ ( నేనొక్కడినే ) సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల మందుకు వస్తుందని టీజర్ విడుదల చేసిన రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ కు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రం పై భారీ ఆశలు పెరిగిపోయాయి. తాజాగా ఫిలిం నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రచారం ఈ చిత్రం విడుదలను సంక్రాంతికి వాయిదా వేశారని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలై చాలా రోజుల అయినా ఇంత వరకు షూటింగ్ కంప్లీట్ కాకపోవడమే కాకుండా, అనుకున్న సమయానికి కూడా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో దీన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. కొంత మంది మాత్రం మహేష్  గత సినిమాలు (ఒక్కడు, బిజినెస్‌మేన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు) సినిమాలు సంక్రాంతికి విడుదల అయి పెద్ద హిట్ కొట్టాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంటును ఫాలో అవుతున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ సినిమా కోసం 2014 సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఇక నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. మరి ఈ సినిమాకు గత సినిమాల సెంటిమెంటు వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles