Ram charan and pawan kalyan likely to clash in august

Pawan Kalyan Vs Ram Charan, Pawan Kalyan and Charan clash, Ram Charan Teja new film, Fight at box office, Mega Power star, Pawan Agry at the postponement of Attarintiki Daredi

Ram Charan and Pawan Kalyan likely to clash in August.

వీరిద్దరి మధ్య వార్ తప్పదా ?

Posted: 07/10/2013 05:47 PM IST
Ram charan and pawan kalyan likely to clash in august

మెగా, పవన్ అభిమానులకు శుభవార్త. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా విడుదల  తేదీ ఖరారు అయింది. ఈ సినిమాను ఆగష్టు 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఆ సినిమా నిర్మాత బి.వి.యన్ ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్ గా ఉన్న ‘అత్తారింటికి దారేది ’ అనే టైటిల్ నే ఈ సినిమాకు టైటిల్ గా నిర్ణయించారు. ఇన్ని రోజులు ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అని, పవన్ కళ్యాణ్ ఈ టైటిల్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని కొత్త టైటిల్ ని వెతికే పనిలో దర్శకుడు ఉన్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ చివరకి నిర్మాత టైటిల్ ని, విడుదల తేదీని ఖరారు చేయడంతో ఈ సినిమా పై ఉన్న పలు అనుమాలు తొలిగిపోయాయి. ఇక అబ్బాయి రామ్ చరణ్ ముందే విడుదల కావాల్సి ఉన్నా, ‘ఎవడు ’ సినిమా జులై 31వ తేదీనే విడుదల కావడం, బాబాయి పవన్  సినిమా వారం రోజుల వ్యవధిలోనే విడుదల కావడంతో వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ తప్పదని, కలెక్షన్ల విషయంలో కూడా ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు ‘ఎవడు ’ సినిమా నిర్మాత  దిల్ రాజు పవన్ ని సినిమాను మరో రోజుల పాటు వాయిదా వేసుకోమని కోరుతున్నట్లు సినిమా వర్గాల వార్తలు. మరి ఎప్పుడు అందరి మంచి కోరుకునే పవన్ కళ్యాణ్ అబ్బాయి కోసం తన సినిమాను వాయిదా వేసుకుంటాడా లేదో చూడాలి అని సినీ జనాలు అనుకుంటున్నారు. ఒకవేళ బాబాయి వెనక్కి తగ్గకపోతే మాత్రం థియేటర్స్, కలెక్షన్ల లో తేడా వస్తుందనేది మాత్రం నిజం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles