Nitin puri jagannath film titled as heart attack

Nitin Puri Jagannath, Nitin Heart Attack, Nitin Puri Jagannath combo film titled as Heart Attack, Nitin Puri Jagannath Heart Attack, Puri Jagannath to direct Nitin, Nitin, Puri Jagannath, Heart Attack, Varun Tej, Varun Tej Puri Jagannath

Young Hero Nitin has signed a new project ‘Heart Attack’ with maverick director Puri Jagannath.

వీరిద్దరి కాంబినేషన్ హార్ట్ ఎటాక్

Posted: 07/05/2013 10:50 AM IST
Nitin puri jagannath film titled as heart attack

ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గత కొంత కాలంగా దర్శకత్వం వహించిన బడా హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. అయినా ఇతడు మాత్రం సినిమాల స్పీడు తగ్గించడం లేదు. తాజా ఇతడు నాగబాబు కొడుకు ను ‘అందగాడు ’ గా వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. ఆ సినిమా తరువాత ఇటీవల మళ్ళీ ఫాంలోకి వచ్చిన హీరో నితిన్ తో ఓ సినిమా చేసేందుకు కమీట్ అయ్యాడు. ఈ సినిమా వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీనే దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ గా ‘హార్ట్ ఎటాక్ ’ ని పెట్టారు. ప్రస్తుతం నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్ ’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత పూరీ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ సినిమాను ఆగష్టులో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్టులు నితిన్‌కు ఖరారయ్యాయి. అందులో కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో రూపొందబోయే సినిమా ఒకటి కాగా, మరొకటి అలా మొదలైంది, జబర్దస్త్ చిత్రాల ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాలు 2014లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి. మొత్తానికి రెండు సినిమాలు ఇచ్చిన విజయాలతో నితిన్ కెరియర్ మళ్లీ గాడిలో పడినట్లే కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles