Naresh action 3d second half trimmed

Action,3D,Second,Half,Trimmed, Action 3D Second Half Trimmed

Allari Nareshs latest release Action 3D was the biggest openings in his career. The film opened to theatres on 21st June but reception.

యాక్షన్ 3డి ని కత్తిరించారు

Posted: 06/24/2013 04:05 PM IST
Naresh action 3d second half trimmed

అల్లరి నరేష్ హీరోగా అనిల్ సుంకర దర్శకుడిగా భారీ బడ్జెట్ తో తొలిసారి ఇండియా కామెడీ త్రీడీ చిత్రంగా తెరకెక్కిన ‘యాక్షన్ ’ చిత్రం పోయిన వారం విడుదల అయి కాస్తంత  ‘ఓవరాక్షన్ ’ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. పేరుకు కామెడీ చిత్రం అయిన ఈ సినిమాలో నస ఎక్కువుండే సరికి సదరు ప్రేక్షకులు త్రీడీ గ్లాసెస్ పెట్టుకొని ఇంత సొల్లును భరించలేకపోతున్నామని చెప్పడంతో కాస్తంత అలర్ట్ అయిన ఆ చిత్ర దర్శకుడు ఈ సినిమాలో ఎక్కడెక్కడ అనవసరపు సీన్లు ఉన్నాయో.... వాటిని కత్తిరించే పనిలో పడ్డారట. హ్యాంగోవర్‌ అనే ఆంగ్ల చిత్రాన్ని కాపీ కొట్టి ఒరిజినల్‌ కామెడీ తీసినట్టు బిల్డప్‌ ఇచ్చి బోల్తా పడ్డ దర్శకుడు దాదాపు 15 నిమిషాల సినిమాకు కత్తెర్లు వేసినట్లు సినిమా వర్గాల సమాచారం. వాస్తవానికి సినిమాలో కాస్తంత చూడదగిన సీన్లు మొత్తం 15 నిమిషాలు మాత్రమే ఉంటాయి. ఆ లెక్కన చూసుకుంటే సినిమా నివిడిలో 15 నిమిషాలు మాత్రమే మిగులుతుంది. ఈ పదిహేను నిమిషాలు పోగా మిగిలిదాన్నైనా ప్రేక్షకులు భరించగలరా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles