Prabhas eyes on bahubali overseas rights

young rebel star Prabhas, bahubali overseas rights, S S Rajamouli, Bahubali, Rs 10 cr overseas rights, rana, Tollywood

The young rebel star is not taking any money in advance but just looking at lifting the overseas rights.

ప్రభాస్ రెమ్యునరేషన్ అంతా ?

Posted: 05/02/2013 11:24 AM IST
Prabhas eyes on bahubali overseas rights

నిన్నటి వరకు హాలీవుడ్ బాలీవుడ్ హీరోల పారితోషికాలే కోట్లలో ఉండేవి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ దక్షిణాదికి కూడా పాకినట్లు ఉంది. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోల పారితోషికాలు ఇప్పుడు భారీగా ఉన్నాయని ఫిలింనగర్ టాక్. నిన్నటి వరకు నాలుగు, ఐదు కోట్లు మాత్రమే తీసుకునే వారు. కానీ ఇప్పుడు వారి పారితోషికాలకు బదులు నిర్మాత దగ్గరి నుండి వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటున్నారట. ఇఫ్పటికే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ విషయంలో అదే చేశాడు. ఈయన బాటలోకి మరికొంత మంది హీరోలు నడుస్తున్నారు. రెబల్ స్టార్ ‘ప్రభాస్ ’ మిర్చి సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా మంచి వసూళ్ళను కూడా రాబట్టింది. ఈ సినిమా ఓవర్సీస్ రేట్లు కూడా బాగానే అమ్మడయ్యాయి. దీంతో ప్రభాస్ తాజాగా రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే ‘బహుబళి ’ సినిమా కూడా ఇంకా భారీ రేటుకు అంటే దాదాపు 10 కోట్లకు అమ్మడవుతాయని సినీ వర్గాల అంచనా. అందుకే ప్రభాస్ గంప గుత్తగా పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు అడుగుతున్నాని అంటున్నారు. ఆ నిర్ణయానికి వచ్చే నిర్మాతల దగ్గర పారితోషికం కూడా అడ్వాన్స్ గా తీసుకోలేదట.  అంటే ప్రభాస్ ఈ సినిమా రెమ్యునరేషన్ పది కోట్లు అని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles