Hero allu sirish speaks in gouravam movie story

allu sirish, allu aravindu, gouravam movie audio review, movie review, gouravam film review, gouravam cinema review, allu sirish, gouravam latest trailer allu sirish

hero allu sirish speaks in gouravam movie story

'గౌరవం' స్టోరీ ఇదేనట ?

Posted: 04/12/2013 12:14 PM IST
Hero allu sirish speaks in gouravam movie story

"నేను చెన్నైలో పెరిగినంత కాలం కులం గురించి తెలియలేదు. కానీ హైదరాబాద్‌కు వచ్చాక కులాల గురించి తెలిసింది. ఓ గ్రామానికి తన ఫ్రెండ్‌ను వెతుక్కుంటూ వెళ్లేలకథ ఇది. ప్రతి గ్రామంలోనూ, ఇంట్లోనూ బాగా పరిచయమైన కథ ఇది. గౌరవం కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే వారి కథ. రొమాంటిక్ అంశాలుంటాయి. ఫైట్లుంటాయి. ఈ నెల 19న విడుదల కానుంది. ప్రేక్షకులు, పరిశ్రమ నన్ను యాక్సెప్ట్ చేస్తారని భావిస్తున్నాను'' అని అల్లు శిరీష్ అన్నారు.  ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'గౌరవం'. ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. యామి గౌతమ్ నాయిక. రాధామోహన్ దర్శకుడు. ఎస్.ఎస్.థమన్ సంగీత దర్శకుడు. ప్రకాష్‌రాజ్ నిర్మాత. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ "తెలుగు, తమిళంలో ప్రతి షాట్‌ను విడివిడిగా చేశాం. కష్టతరమైనా శిరీష్ ఇష్టంగా చేశారు. యామి బాగా నటించింది'' అని అన్నారు. మెసేజ్‌తో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమని యామి అన్నారు. తన తండ్రికి అల్లు అరవింద్ ఎలాగో, తనకు శిరీష్ అలాంటి వాడని, సలహాలు శిరీష్‌నే అడుగుతానని రామ్‌చరణ్ చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ "శిరీష్‌కు ఓ కథ విని నచ్చి నా దగ్గరకు తీసుకొచ్చాడు. ప్రకాష్‌రాజ్ ఈ సినిమా చేయడం మెగా ఫ్యామిలీకి ఆయన ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం'' అని అన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles