ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న హీరో విక్టరీ వెంకటేష్ ఆ తరం నుండి నేటి తరం హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. వెంకటేష్ కి క్రేజ్ బాగానే ఉన్నా, బడ్జెట్ పరంగా మార్కెట్ లేదు. ఇప్పుడున్న యంగ్ హీరోల సినిమాల బడ్జెట్ 40 కోట్లకు పై మాటే. సినిమా హిట్ అయినా కాకున్నా కలెక్షన్లు మాత్రం ఫుల్లుగా వస్తున్నాయి. కానీ వెంకటేష్ సినిమా పరిస్థితి భిన్నం. యువ హీరోల లాగానే భారీ బడ్జెట్ తో తాజాగా ‘షాడో ’ ని నిర్మించారు. ఈ సినిమా మొదలయ్యి చాలా రోజుల అవుతున్నా ఇంత వరకు విడుదల కాలేదు... సరికదా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత మార్చి నెలాఖరున అనుకున్నారు. అదీ కుదరలేదు. ఉగాదికి గ్యారెంటీ అన్నారు. కానీ ఇప్పుడు ఉగాదికి కూడా డౌటే అంటున్నారు. కారణం బడ్జెట్. ఈ సినిమా కోసం దాదాపుగా 45 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. వెంకి మార్కెట్ కి అది చాలా ఎక్కువ. అందుకే నిర్మాత ఎంతకో ఒకంతకీ అమ్ముకోలేక పోతున్నాడు. బయ్యర్లు భారీ రేట్లకు కొనలేకపోతున్నారు. ఈ సినిమా 20 కోట్ల మేర డెఫిషిట్ ఉందని తాజా సమాచారం. దానికి తోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్ ’ షా సినిమా విడుదల అవుతుంది. దీనిని తట్టుకొని షాడో నిలబడుతుందో లేదో అనే అనుమానం ఒక్కటి. దీంతో ఈ సినిమా ఉగాది కి కూడా విడుదల అవ్వడం కష్టమే అంటున్నారు. ‘బాద్ షా ’ పరిస్థితి చూసి, దాని వేడి కాస్త తగ్గిన తరువాత విడుల చేయాలని భావిస్తున్నారట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more