Neha sharma turns cold

neha sharma, neha sharma and vivek oberoi, jayant bhai ke luv story movie, neha intimate scenes

neha sharma realizes her mistake to act in hot scenes.

neha sharma turned cold.gif

Posted: 02/15/2013 01:56 PM IST
Neha sharma turns cold

neha-sharma

చిరుత కథా నాయకి నేహా శర్మ హిందీలో చాల ధైర్యంగా తన సహజ సౌందర్యాలను ప్రదర్శించటమే కాకుండా, పెదవులతో కథానాయకుడి తన ప్రేమను పంచుకోవటానికి సిద్ధపడ్డా,  సారీ ఇక నేను అలాంటి తప్పులు చెయ్యనంటోంది.  సమాజ మర్యాద కోసం శరీరానికి ఆచ్ఛాదన కలుగజేసే వస్త్రాలను అలా క్లోజప్ షాట్లలో తొలగించటం, శృంగారాన్ని పండించటం కోసం మురిపాలను ముద్దుల రూపంలో కురిపించటం లాంటివి తనకు తగవని, తన కుటుంబ సభ్యులు కూడా మెచ్చరని, అందువలన ఇక మీదట అలాంటి వాటికి దూరంగా ఉంటానని అంటోంది. 

హిందీలో ఒక సామెత ఉంది సుబహ్ కా భూలా ..... అంటూ అంటే, ఉదయం తప్పుగా ప్రవర్తించినా సాయంత్రానికల్లా పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగివస్తే క్షమించేయాలని.  అలా తన కుటుంబ సభ్యలు, సభ్య ప్రపంచం తను లోగడ కథానుసారం చెయ్యవలసి వచ్చిన శృంగార సన్నివేశాలను మన్నిస్తారని నేహా శర్మ నమ్ముతోంది. 

క్యా సూపర్ కూల్ హై హమ్ అనే పెద్దలకు మాత్రమే వీక్షించే అనుమతి ఉన్న హాస్యప్రధాన చిత్రంలో నటించి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జయంత్ భాయ్ కీ లవ్ స్టోరీ సినిమా హీరో వివేక్ ఓబరాయ్ సరసన కాస్త మోతాదు మించిన శృంగారానికి సై అన్నట్టుగా వచ్చిన వార్తల దృష్ట్యా నేహా పై విధంగా స్పందించింది.  స్క్రిప్ట్ ని బట్టి అప్పుడు కొన్ని దృశ్యాలలో చెయ్యవలసి వచ్చినా ఇప్పుడు తనకి ఙానోదయమైందని, అయినా అప్పుడూ తనకి నచ్చలేదని నమ్మబలుకుతోంది నేహా. 
ధర్మేంద్ర కుటుంబ సభ్యులతో లోగడ తీసిన యమలా పగలా దీవానా సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న రెండవ అంకంలో నేహా ప్రధాన పాత్ర పోషించబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andala rakshasi hero rahul in suresh productions
Sukumar dream project  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles