Baadshah is the high budget film

ntr baadsha movie, ntr baadshah, ntr films, jr ntr movies, srinu vitla, bandla ganesh, film news, movie news, badsha teaser, baadsha wallpapers, working stills, baadshah is the high budget film

baadshah is the high budget film

5.gif

Posted: 01/31/2013 06:19 PM IST
Baadshah is the high budget film

bad_e

       యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా.... ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల రూపొందిస్తున్న ‘బాద్ షా’ సినిమా షూటింగ్ ముగింపు దశలో వుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను నాగార్జునసాగర్‌ సమీపంలో భారీ ఎత్తున చిత్రీకరించారు. తాజా వివరాల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ లెక్కకుమించి దాటిపోతుందని తెలుస్తోంది. ఇంతవరకూ ఈ సినిమాకు అయిన ఖర్చు 57 కోట్ల రూపాయలు దాటిందని విశ్వసనీయవర్గాల సమాచారం. భారీనిర్మాత బండ్లగణేష్ ఈ చిత్రం మీద ఖర్చుపెట్టేందుకు ఏమాంత్రం సంకోచించకుండా దర్శకునికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.  ఎక్కువగా విదేశాల్లో షూటింగు జరపడం వల్లనే ఈ స్థాయిలో ఖర్చు అయిందని లెక్కలు చెబుతున్నాయి.
     కాగా,  ఎన్టీఆర్‌కున్న మార్కెట్‌ పరంగా ఈ బడ్జెట్‌ వర్కౌట్‌ అవుతుందా అని కొందరు సినీ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో ఈ సినిమా బిజినెస్‌ జరుగుతుండటం నిర్మాత బండ్ల గణేష్‌ కు చాలామేరకు ఊరటనిచ్చిందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ' నాయక్', చరణ్ మరో సినిమా 'ఎవడు' విడుదలకు ముందు బిజినెస్ పరంగా సృష్టించిన రికార్డులను 'బాద్ షా' దాటుకుపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
        గతంలో 'నాయక్' విడుదలకి ముందే సీడెడ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కుల నిమిత్తం 7 కోట్ల 5 లక్షలను రాబట్టుకోగా, 'ఎవడు' సినిమా నెల్లూరు డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారా 1కోటి 95 లక్షలను రాబట్టుకుంది. అయితే తాజాగా 'బాద్ షా' ఆ రికార్డులను దాటిపోయింది. ఈ సినిమా సీడెడ్ ఏరియా హక్కులను శోభన్ అనే డిస్ట్రి బ్యూటర్ 8 కోట్ల 10 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక, నెల్లూరు ఏరియాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారా 2 కోట్లు రాబట్టుకున్నట్లు తెలుస్తోంది.
     కాగా భారీ బడ్జెట్ మూవీ ‘బాద్ షా’  ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. బండ్లగణేష్  నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా, నవదీప్‌ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha comment on pizza movie
Nayak 50 crores collection  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles