ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అంతందంగా లేకపోవటంతో పద్దతైన డైరెక్టర్ తన పద్దతి మార్చుకున్నాడు. ఇంతవరకూ ఏడాదికో, రెండేళ్ళకో ఓ సినిమా చేస్తున్న శేఖర్ కమ్ముల ఇక నుంచి త్వరితగతిన సినిమాలు పూర్తి చేయలనే డిసైడయ్యాడు. ఆ మధ్య శేఖర్ దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం 'హ్యాపీడేస్' లాగానే ఉందనే విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తన తదుపరి చిత్రాన్ని వినూత్నంగా, విభిన్న కథ కథనంతో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
ఇందులో భాగంగా శేఖర్ చూపు బాలీవుడ్ 'కహాని'పై పడింది. విద్యాబాలన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. 10 కోట్లతో తీసిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్ళ వర్షం కురిపించింది. దాంతో ఈ సినిమా హక్కులు పంది రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు శేఖర్ కమ్ముల.
ఇంతకీ ఈ చిత్ర కథాంశం ఏంటంటే.. భర్త ఆచూకీ కోసం మహానగరంలో అడుగుపెట్టిన నిండుగర్భిని అగచాట్లే ఈ మూవీ ఇందులో విద్యా తన నటనతో విమర్శకులను సైతం మెప్పిస్తే, ఇప్పుడు ఆ పాత్రలో నయనతార కన్పించబోతోంది.
మళ్లీ ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. ప్రధాన కథాంశం మాత్రమే తీసుకుని కథనాన్ని తనదైన రీతిన నడిపించేందుకు కమ్ముల స్క్రిప్ట్ సిద్ధంచేసుకున్నాడు. మార్చిలో షూటింగ్ మొదలుకాబోతుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more