Forbs riches persons in india

sharukh khan, forbs riches persons, bollywood stars, katrina kaif, cricketer dhoni, saina nehwal, sachin tendulkar, kareena kapoor, chetan bhagat, karan johan, malika arora khan, ar rahman, salman khan, amitab bachhan, sehwagh, katrina

sharukh khan is the richest person in indian celebrate

5.gif

Posted: 01/25/2013 04:15 PM IST
Forbs riches persons in india

       shahrukh-khan-1

       భారతదేశంలో అత్యంత ధనికుడైన సెలబ్రిటీగా షారుఖ్ ఖాన్ అందలమెక్కాడు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం 2011 అక్టోబర్ నుంచి సెప్టెంబర్ 2012 వరకు ఈ బాలీవుడ్ బాద్‌షా గడించిన ఆదాయం అక్షరాలా రూ. 202.8 కోట్లు. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రూ.144.2 కోట్లు, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రూ.135.16 కోట్లు నిలిచారు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా తొలిసారి రూపొందించిన ‘సెలబ్రిటీ 100 స్పెషల్’ ప్రత్యేక సంచికలో ఈ వివరాలను పొందుపరిచింది.

karee
     అంతేకాదు.. బాద్ షా షారుఖ్ ముఖచిత్రంతో రేపు (ఈ నెల 26న) సంచిక మార్కెట్లోకి రానుంది. అయితే బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా ఆర్జన విషయంలో అందరికన్నా ముందున్న షారుఖ్… పేరు ప్రఖ్యాతుల విషయంలో మాత్రం సల్మాన్, ధోని తర్వాతే నిలిచాడు.
      క్రీడాకారుల్లో ధోని టాప్‌లో నిలువగా, సంగీతంలో ఏ‌ఆర్ రెహమాన్, టీవీ ప్రముఖుల్లో మలైకా అరోరా ఖాన్, దర్శకుల్లో కరణ్ జోహార్, రచనలో చేతన్ భగత్, కమెడియన్ వీర్ దాస్, మోడల్ ఇషా గుప్తా తమ విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు.
     ఈ జాబితాలో ఎక్కువ మంది సెలబ్రిటీలు 30 నుంచి 50 ఏళ్ల వయసు వారైనప్పటికీ సైనా నెహ్వాల్, విరాట్‌కోహ్లి, సానియా మీర్జా సహా 12 మంది యువ సెలబ్రిటీలు టాప్ 50లో చోటు సంపాదించారు. 23 ఏళ్ల సైనా ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.

katri
      టాప్ టెన్ జాబితా ఇలా ఉంది.. షారుఖ్, సల్మాన్ ఖాన్, ధోని, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, కరీనా కపూర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, కత్రినా కైఫ్.
       కాగా, మొత్తం ఎనిమిది విభాగాల్లో (సినిమా నటులు, డెరైక్టర్లు, క్రీడాకారులు, టీవీ ప్రముఖులు, సింగర్స్,  సంగీతకారులు, రచయితలు, మోడల్స్, కమెడియన్స్) ఎక్కువ ఆదాయం, ఖ్యాతి మీడియా కథనాలు, ఆన్‌లైన్ ఖ్యాతి, సామాజిక వెబ్‌సైట్లలో మద్దతుదారుల సంఖ్య ఆధారంగా ఈ ఎంపిక జరిగింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapsi muni3 movie news
Police case against producer bellamkonda suresh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles