Agitations on nayak movie title

ramcharan nayak movie, nayak movie vv vinayak, agitations on nayak movie, dispute on nayak movie title, nayak movie wallpapers, nayak movie teaser, nayak movie casting, nayak movie news, nayak movie videos

agitations on nayak movie title

1.gif

Posted: 01/07/2013 10:47 AM IST
Agitations on nayak movie title

nay

        ఎల్లుండు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోన్న 'నాయక్‌' చిత్రం మీద తాజాగా వివాదం చెలరేగింది. చిత్రం పేరును గిరిజన విద్యార్ధి సమాఖ్య వ్యతిరేకిస్తోంది.  ఫలితంగా తిరుపతో లోని ఎస్‌వి వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద సమాఖ్య కార్యకర్తలు ధర్నా చేశారు. చిత్ర దర్శకుడు వివి వినాయక్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.
         సమాఖ్య అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ టైటిల్‌ ఎంపికపై నిర్మాతలను తప్పుపట్టారు. ఇందులో గిరిజన జీవన విధానం కాని చరిత్ర కాని ప్రతిబింబించలేదన్నారు. ఈ కాలంలో పలు తెలుగు చిత్రాలు సెక్స్‌ కు, ముఠా తగాదాలకు, నేరప్రవృత్తి కథాంశాలతో కూడిన స్క్రిప్ట్‌ లకు ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. టైటిల్‌ మార్చకపోతే చిత్ర ప్రదర్శన అడ్డుకుంటామని హెచ్చరించారు. సెన్సార్‌ బోర్డుకు హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
         మరో ప్రక్క ఈ సినిమాకు ‘నాయక్' అనే టైటిల్ పెట్టడాన్ని తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. ఉస్మానియా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం నేతలు తమ అభ్యంతరం వ్యక్తం చేసారు. గిరిజన ఆత్మగౌరవానికి సంబంధించిన ‘నాయక్' అనే పదాన్ని వాడరాదని, ఈ పదం గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని సినిమా వ్యాపారం కోసం వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, వెంటనే ‘నాయక్' టైటిల్ ను మార్చాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka karti badboy movie postpone
Adavi sheshu kiss moive news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles