Ntr harishshankar movie shooting starts

ntr harishshankar movie, ntr harish picture, ntr mvoies, ntr, harish shankar, gabbarsingh director, ntr latestpics, ntr badsha, ntr brundavanram, samantha, kajal, taman, music director taman, ntr harish movie shooting starts

ntr harishshankar movie shooting starts

1.gif

Posted: 01/04/2013 01:50 PM IST
Ntr harishshankar movie shooting starts

ntr_e

        తెలుగు తెరమీద సంచలనం రేకెత్తించే సత్తాగల కాంబినేషన్ లో మరో మూవీ ఇవాళ ప్రారంభం అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్-‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ ఈ ఉదయం మొదలైంది. ఈ సినిమా ముహూర్తం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. హిట్ మూవీ ‘బృందావనం’లో యంగ్ టైగర్ తో జోడీకట్టిన సమంతా ఈ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు.
        ఎన్టీఆర్ ఈ సినిమాలో పవర్ ఫుల్ కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్. బృందావనం సినిమాకి సూపర్బ్ మ్యూజిక్ అందించిన తమన్ ఈ సినిమాకీ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాద్ షా మూవీకి కూడా సంగీత దర్శకుడు తమన్ కావటం విశేషం. ఇక  సినిమా  జూలైలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
         కాగా, యన్టీఆర్-శ్రీనువైట్ల కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్షా’ ఆడియోని మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కథను కోన వెంకట్ – గోపి మోహన్ అందించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nag nayanatara movie sarilleru nekevvaru
Not postpone nayak and svsc release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles