Victory venkatesh movies update

victory venkatesh, hero venkatesh, venkatesh movies update, venkatesh latest pics, venkatesh shadow, venkatesh movies, venkatesh films, venkatesh svsm, venkatesh movie news

victory venkatesh movies update

22.gif

Posted: 12/28/2012 06:29 PM IST
Victory venkatesh movies update

Shadow_Movie_in1

       ఫిలాసఫీని అమితంగా ఇష్టపడే విక్టరీ వెంకటేష్ మరిన్ని మల్టీస్టారర్ మూవీలతో తన స్పాన్ పెంచుకునే ప్లానింగ్ లో ఉన్నట్టు గోచరిస్తుంది. ఇందుకనుగుణంగానే అతను తీసుకుంటున్న స్టెప్స్ ఉంటున్నాయి. తన వయసును, ట్రెండును దృష్టిలో పెట్టుకుని ఇకపై సోలో హీరోగా వెళ్ళడం కంటే, మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ ముందుకు సాగాలని వెంకీ యత్నిస్తున్నాడు.
          ఇందులో భాగంగానే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు',.. 'షాడో',.. ఇక త్వరలో రామ్ తో 'బోల్ బచ్చన్' రీమేక్. అలాగే, ప్రభాస్ తో కలిసి మరో మల్టీ స్టారర్ మూవీ. మరోపక్క, పవన్ కల్యాణ్ తో కలిసి ఇంకో చిత్రం చేసే ఆలోచన. ఇంకా, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ వంటి హీరోలతోకూడా వెంకీ అలరించబోతాడని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
        ఇదిలాఉంటే,  విక్టరీ వెంకటేష్‌ - స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తోన్న మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ షాడో. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ బాలీవుడ్లో అమ్ముడు పోయి తన సత్తాఏంటో చెప్పకనే చెప్పింది. ఈ మూవీ తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈనెల 23 నుంచి షూట్ చేస్తున్న ‘షాడో’ చివరి షెడ్యూల్‌ పూర్తికావొచ్చిందని నిర్మాత వెల్లడించారు. వెంకీ కథానాయకుడిగా తాప్సీ కథానాయికగా, శ్రీకాంత్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు.
         ఎ.యూస్క్వేర్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి కిరిటీ సమర్పణలో పరుచూరి శివరామప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి నిర్మాత మాట్లాడుతూ..  ‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. వినోదానికి పెద్ద పీటవేసి రూపొందించాం. తమన్‌ చక్కటి సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు అద్భుత స్పందన లభించింది. వెంకటేష్‌ కొత్తగా కన్పిస్తారు. ఫిబ్రవరిలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి వేసవిలో సినిమాను విడుదల చేస్తామని' తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ళ, కథ: కోన వెంకట్‌, గోపి మోహన్‌, మాటలు: కోన వెంకట్‌, మెహర్‌రమేష్‌..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil mr pellikoduku movie first look superb
Nayak hindi rights and boyapati charan moive  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles