Ramcharan nayak promo songs release

ramcharan nayak, nayak movie, nayak promo songs, nayak promo release, ramcharan, kajal, kajal hot, vv vinayak, nayak wallapapers, nayak teaser, nayak posters, nayak

ramcharan nayak promo songs release

21.gif

Posted: 12/13/2012 05:02 PM IST
Ramcharan nayak promo songs release

            మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వీవీ వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘నాయక్’ చిత్రం ఆడియో వేడుకకు రకరకాల తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. ఒక రోజు ఒక డేట్ వస్తే... మర్నాడు అది కాదు... ఇది అంటూ మరొకటి వార్తల్లో నిలిచేది.  చివరికి ఈ రోజు ఫైనల్ డేట్ ఖరారు అయింది. ఈ నెల 17 సాయంత్రం ఈ వేడుక అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించారు.
          ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా విచ్చేయనున్న కేంద్ర మంత్రి  చిరంజీవి డేట్ దొరకడంలో తలెత్తిన సమస్య కారణంగానే ఈ మార్పులు జరిగాయని తెలుస్తోంది. అయితే, వెన్యూ ఎక్కడనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. 

Naayak-Audi
         మరోవైపు  రామ్ చరణ్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న 'జంజీర్' చిత్రం విడుదల ఖరారై పోయింది. చరణ్ - ప్రియాంకా చోప్రా జంటగా అపూర్వ లఖియా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొత్త ఏడాది ఏప్రిల్ 12 న విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. మొదట ఈ సినిమాను వచ్చే ఏడాది మే నెలలో 11 వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. ఎందుకంటే, అమితాబ్ నటించిన అలనాటి 'జంజీర్' ఈ తేదీనే విడుదలై సంచలన విజయానికి నిదర్శనంగా నిలిచింది.
         అయితే అనివార్య కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకుని, వేసవి సెలవులకి కాస్త ముందుగా విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తానకి చరణ్ బాలీవుడ్ డెబ్యూ రావటానికి ఇంకెంతో దూరంలో లేదన్నమాట.
     ఇంకో విశేష మేమిటంటే ఇవాళ ‘నాయక్’ మూవీ ప్రోమో సాంగ్స్ విడుదల చేశారు. విడుదలైన కొద్ది సేపటికే హల్ చల్ చేస్తోన్న ఆ టీజర్స్ ఇవే...   

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan rana daggubati multi starer movie
Intinta annamaiah movie shooting progress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles