ప్రేమిస్తే... సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన భామ సంధ్య. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంధ్య తరువాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా పెద్ద హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్నటించిన అన్నవరం సినిమాలో చెల్లెలి క్యారెక్టర్ వేసినా, ఈ అమ్మడుకి ఆ పాత్ర అవకాశాలు తెచ్చిపెట్టలేక పోయింది. ఇటు తెలుగు, తమిళంలో పూర్తిగా అవకాశాలు లేకుండా పోవడంతో సంధ్య మళ్ళీ తనకు పూర్వవైభవాన్ని తెచ్చుకోవాని భావించి, తనకున్న ఏకైక అస్ర్తాన్ని వదలడానికి సిద్దం అయింది. చాలా రోజుల తరువాత రాక రాక ఓ తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో తనకున్న అందాలన్నీ చూపించి వరుసగా అవకాశాలు రాబట్టుకోవాలని చూస్తుందట. ఈ సినిమాలో సంధ్య శ్రుతి మించి ఎక్స్ పోజింగ్ చేసిందని, కొన్ని సీన్లలో అయితే బట్టలు లేకుండా కూడా నటించిందని తమిళ సినిమా వర్గాల సమాచారం. అసలే ఖాళీగా ఉన్న సంధ్య మునుపటి కన్న కాస్త బొద్దుగా కూడా తయారైంది. ఈ బొద్దు అందాలు తెరపై బాగా కనిపిస్తాయని, దాంతో తన కోసం ఖచ్చితంగా క్యూ కడతారని కలలు కంటుందట సంధ్య. ఈమె పగటి కలల సంగతేమో గానీ, సంధ్య చూపించిన ఆ అందాలను సదరు దర్శకుడు పోస్టర్ల పై వేసి, ప్రేక్షకులను మాత్రం థియేటర్ కి క్యూ కట్టే విధంగా ప్లాన్ చేశాడట. ఈ సినిమా విడుదల అయితే కానీ తెలియదు సంధ్య కొసం దర్శకులు క్యూ కడతారో, లేక సంధ్య బోల్టు సీన్లను చూడటానికి జనం థియేటర్ క్యూ కడతారో.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more