Actress sriya sharan activities

actress sriya, shriya, sreya sharan, sriya movies, sriya hot pics, sriya public awareness, sriya social service, sriya teaser, sriya movies telugu movies, activities, santosham movie,

actress sriya sharan activities

7.gif

Posted: 11/12/2012 02:06 PM IST
Actress sriya sharan activities

sriya_fntee

అమ్మాయిలు, దర్శక నిర్మాతలే కాదు సగటు ప్రేక్షకుడు కూడా అనేమాట...  అందం..అభినయం కలిస్తే శ్రియ అని. అయితే ఈమె గురించి చాలా మందికి తెలియని సంగతేంటంటే.. తనకి చేతనైనంత సాయం చేసే మంచి గుణం కూడా ఆమెలో ఉంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రియ, ప్రతిభ, పట్టుదలతో సాధారణ అమ్మాయి అనే స్థాయి నుంచి సినిమా హీరోయిన్‌గా ఎదిగింది. తన అదృష్టానికి అహంకారాన్ని అంటనివ్వకుండా, సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తోంది. అంధులకు, అనాథలకు, అభాగ్యులకు తన పారితోషికంలో కొంత భాగాన్ని కేటాయిస్తూ ఉంటోంది. ఈ విషయంలో ఆమె తనతోటి కథానాయికలకు స్ఫూర్తిగా నిలుస్తోంది కూడా.. అంతేకాదు పర్యావరణ పరిరక్షణపై కూడా శ్రియకు మంచి అవగాహన ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ఏ పనిని ఆమె చేయదు. మరొకరిని ప్రోత్సహించదు. అందుకే 'దీపావళి' పండుగ రోజున దీపాలు వెలిగిస్తాను కానీ టపాసులు మాత్రం కాల్చనని, ఈ విషయానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా తాను ఎక్కువగా పాల్గొంటూ ఉంటానని ఆమె చెబుతోంది. ఇదంతా తెలిశాక శ్రియ కన్నా ఆమె మనసు మరింత అందంగా కనిపిస్తోంది కదూ..
      ఇక ఈ సౌందర్య మనస్వి వెండితెర ఎంట్రీ అనుకోకుండా జరిగిందే.., డిగ్రీ చదువుతోన్న సమయంలో 'ఇష్టం' సినిమాలో అవకాశం రావడంతో, ఆ ఒక్క సినిమా చేసేసి, మానుకుందామని శ్రియ అంగీకరించిందట. ఆ తర్వాత 'సంతోషం' సినిమాలో అవకాశం రావడంతో, పెద్ద బ్యానర్‌ కదా చేసి చూద్దామని అనుకుని గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. కానీ ఈ సినిమా తర్వాత ఆమె కథానాయికగా ఇక వెనుతిరిగి చూసుకోలేదు. అలా అంచలంచెలుగా ఎదిగిన శ్రియ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. దీపావళి పండుగ సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతోంది శ్రియ శరణ్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ongole gitta movie audio release this week
Chammak challo aduio launching function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles